Home » పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ భ‌విత‌వ్యం తేలేది నేడే

పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ భ‌విత‌వ్యం తేలేది నేడే

by Anji
Ad

పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప్యూచ‌ర్ ఏమిటో ఇవాళ తేలిపోతుంది. ప్ర‌తిప‌క్షాల అవిశ్వాస తీర్మాణంతో ప‌ద‌వీలో కొన‌సాగ‌డం సందిగ్దంగా మారింది. భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ పై వ్య‌వ‌స్థ త‌న‌కు మూడు అవ‌కాశాలు ఇచ్చింద‌ని పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొంటున్నారు. ఆయ‌న ముందు రాజీనామా చేయ‌డం అవిశ్వాసంపై ఓటింగ్‌ను ఎదుర్కోవ‌డం లేదా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ఈ మార్గాలు ఉన్నాయంటున్నారు. విప‌క్షాల అవిశ్వాసం తీర్మాణంపై పాక్ జాతీయ అసెంబ్లీలో ఇవాళ ఓటింగ్ జ‌రుగ‌నున్న‌ది.

Advertisement

Advertisement

ఎన్నిక‌లు ఉత్త‌మ‌మైన మార్గంగా భావిస్తున్నాన‌ని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. రాజీనామా గురించి అస‌లు ఆలోచించ‌డం లేద‌ని ఇమ్రాన్ వెల్ల‌డించారు. అవిశ్వాసంపై చివ‌రివ‌ర‌కు పోరాడాల‌న్న‌ది ఇమ్రాన్ వ్యూహం. సొంత ఆర్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ నుంచి కొంద‌రూ ఎంపీలు విప‌క్షంలోకి ఫిరాయించారు. అవిశ్వాస తీర్మాణం వీగిపోయినా ప్ర‌భుత్వాన్ని న‌డిపే ఆలోచ‌న ఇమ్రాన్ కు లేద‌ని తెలుస్తోంది. ఏమ‌వుతుందో చూడాలి.

Visitors Are Also Reading