ఒక కుటుంబం అన్నాక ఏదో ఒక గొడవ రావడం కామన్. కానీ ఎక్కువగా గొడవలు వచ్చేది మాత్రం ఆస్తుల విషయంలోనే.. అయితే కొంత మంది తల్లిదండ్రులు ఆస్తుల విషయంలో గొడవలు వచ్చినప్పుడు వారి ప్రాపర్టీస్ ను వారికీ నచ్చిన వారి పేరుమీద చేసుకోవచ్చు.. ఎవరి ఇష్టం వారిది.. కొంతమంది వారి ఆస్తులను అనాధ శరణాలయాల కు, కొంతమంది ప్రభుత్వానికి రాసి ఇస్తారు. లేదంటే కొంతమంది వారి కుటుంబ సభ్యులలో ఎవరికో ఒకరికి రాసి ఇస్తారు. కానీ ఈ తండ్రి మాత్రం కొడుకుపై విసుగుచెంది కొడుకు నమ్ముకోవడం కంటే కుక్కను నమ్ముకోవడం బెటర్ అనుకున్నాడో ఏమో..
Advertisement
ALSO READ:వీల్ చైర్‌కి పరిమితమైన టాలెంటెడ్ నటుల గురించి మీకు తెలుసా..?
విశ్వాసం లేని కొడుకును వదిలేసి విశ్వాసంతో ఉండే కుక్కను చేరదీసి తన ఆస్తిలో సగభాగాన్ని కుక్క పై రిజిస్ట్రేషన్ చేశాడు.. మరి ఆయన ఎవరు అసలు జరిగిన విషయం ఏమిటో చూద్దాం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వాడా జిల్లాలోని బలివాడ గ్రామానికి చెందిన ఓం నారాయణ అనే వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను ఏ పని పాట చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. తిరగటమే కాకుండా లేనిపోని గొడవలు ఇంటి పైకి తీసుకొస్తున్నాడు. ఇలా కొడుకు ప్రవర్తనపై విసుగు చెందిన ఓం నారాయణ పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు మందలించాడు. తండ్రి మాటలు ఏ మాత్రం కేర్ చేయని కొడుకు అలాగే చిల్లరగా తిరుగుతూ తండ్రిని ఇబ్బంది పెడుతూ వచ్చారు.
Advertisement
డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో కొడుకు పై విసుగుచెందిన తండ్రి నువ్వు ఇలాగే చేస్తే నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వను అంటూ హెచ్చరించారు. అయినా కొడుకులో మార్పు రాలేదు. దీంతో కోపానికి వచ్చిన తండ్రి అనుకున్నదే చేశాడు.. తనకున్న ఆస్తిలో సగభాగాన్ని తన రెండవ భార్య పేరు మీద, మిగతా సగభాగాన్ని తాను పెంచుకున్న కుక్క పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ కుక్క పేరు జాకీ… నేను బతికున్నంత కాలం ఆస్తి సర్వహక్కులు తనవేనని, అతను మరణించిన తర్వాత సగం ఆస్తి జాకీకి, మిగతా సగం తన రెండవ భార్యకు అని పూర్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.. అయితే ఆ కుక్కను ఎవరైతే బాగా చూసుకుంటారో ఆ సగం ఆస్తి వారికే చెందుతుందని డాక్యుమెంట్లో పేర్కొన్నారు ఓం నారాయణ.
ALSO READ: