దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లియో. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే లియో పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే మోస్ట్ యాన్టిస్పెటేడ్ ఇండియన్ సినిమా అనే చెప్పవచ్చు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా కొనసాగుతుంది.
Advertisement
ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే లోకేష్ కనకరాజ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నిన్న మొన్నటివరకు ట్రెండ్ అవ్వగా.. ఇక లేటెస్ట్ గా లియో సినిమా డైలాగ్ రైటర్ రత్న కుమార్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన ఇంటర్వ్యూలో తెలపగా.. ప్రస్తుతం ఆ న్యూస్ నెట్ లో వైరల్ గా మారింది. అదేంటి అంటే.. లియో సినిమా షూటింగ్ సమయంలో హీరో విజయ్ తో ఓ సీన్ షూట్ చేస్తున్నప్పుడు లోకేష్ కనకరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడట. విజయ్ పర్ఫామెన్స్ చూసి భావోద్వేగానికి లోనైనా లోకేష్ కట్ చెప్పడం కూడా మరిచిపోయాడట.
Advertisement
ఆ సినిమా మరేదో కాదు.. ట్రైలర్ లో విజయ్ ఫ్యామిలీ జోలికి ఎవరో వస్తున్నారని చెప్పిన డైలాగ్ సీన్ నే నని ఆయన చెప్పుకొచ్చాడు. కొద్ది రోజుల కిందట రిలీజ్ అయిన లియో సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం అందరూ లియో మూవీలో పంచ్ డైలాగ్స్.. అదిరిపోయే పైట్స్ ఉంటాయని భావించారు. లోకేష్ కనకరాజ్ తన సినిమాటిక్ బ్రిలియన్స్ వాడి అందరి ఆలోచనలకు భిన్నంగా ఉండేవిధంగా లియో ట్రైలర్ ని రిలీజ్ చేయగా.. ట్రైలర్ అందరికీ ఎక్కలేదు. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతున్న లియో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరుగుతుందని సమాచారం.