Home » Jr: ఎన్టీఆర్ ను కుంటి గుర్రమని అవమానించిన దర్శకుడు ఎవరో తెలుసా..?

Jr: ఎన్టీఆర్ ను కుంటి గుర్రమని అవమానించిన దర్శకుడు ఎవరో తెలుసా..?

by Sravanthi
Ad

మనం ఏది సాధించాలన్న మనం చేసే పనిపై పట్టుదల, కృషి ఉండాలి.. వీటితోపాటు ఎంత కష్టం వచ్చినా అనుకున్న దానికోసం ముందుకు వెళ్లాలి తప్ప వెనక్కి చూడకూడదు. అప్పుడే సక్సెస్ అవ్వగలం.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ వారి కుటుంబం అణచివేత వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ ను ముందుగా నందమూరి ఫ్యామిలీ వ్యక్తిగా యాక్సెప్ట్ చేయలేదు. అయినా తనలో ఉన్నటువంటి నటన ను నిరూపించుకోవాలని చాలా కష్టపడి పాన్ ఇండియా స్టార్ గా మారారు.. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను స్టార్ డైరెక్టర్ జక్కన్న మొదట్లో కుంటి గుర్రం అంటూ అవమానించారట.. మరి ఆయన అలా ఎందుకన్నారో పూర్తి వివరాలు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి నిన్ను చూడాలని మూవీ చేశారు. దీని తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్లో మరో సినిమా చేయాలని ప్రయత్నించారు.

also read:చిరంజీవికి అస్సలు అచ్చిరాని క్లాస్ సినిమాలు… ఎందుకు ఇలా!

Advertisement

కానీ ఆయన ఏవో కారణాల వల్ల దర్శకత్వం మానేసి దర్శకత్వ పర్యవేక్షణ పనులు చూస్తూ వచ్చారు. మరోపక్క రాజమౌళితో శాంతినివాసం సీరియల్ చేస్తూ యాడ్స్ చేస్తున్నాడు. ఈ సమయంలోనే మూవీ అవకాశం రావడంతో రాజమౌళి డైరెక్షన్ చేసే శాంతి నివాసం సీరియల్ బాధ్యతలు రాజమౌళి కో డైరెక్టర్ కి అప్పచెప్పి స్టూడెంట్ నం 1 సినిమాకు దర్శకుడిగా మారారు. ఇది రాజమౌళికి మొదటి సినిమా. చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు. ఆ విధంగానే మొదటిరోజు షూటింగ్ స్పాట్ కి వచ్చాడు. కానీ అక్కడే ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ ను చూసి నిరుత్సాహపడ్డాడట. వీడేంటి ఇలా ఉన్నాడు.. అనవసరంగా నా మొదటి సినిమాను వీడితో ఒప్పుకున్నానే.. నేను ఇరుక్కుపోయానా అంటూ అనుకున్నారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు రాజమౌళి. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి కనీసం మీసాలు కూడా లేవు.

Advertisement

also read;ల‌వ‌ర్ కోసం క‌లెక్ట‌ర్ అయ్యాడు.! కోట్ల జీతం వ‌దిలి కొత్త జీవితంలోకి….!

చాలా లావుగా డింగ్ డింగ్ మంటూ నడుస్తున్న ఎన్టీఆర్ నడక చూసి వింతగా అనిపించిందని, ఈ వ్యక్తితో నా మొదటి సినిమా రావడం నా కర్మ అనుకున్నానని తెలియజేశాడు. కానీ అలా షూటింగ్ మొదలైంది మధ్యలోకి వచ్చింది , వీరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగిపోయింది. ఎన్టీఆర్ పర్ఫామెన్స్ కూడా నచ్చింది. అప్పుడు అనుకున్నాడట రాజమౌళి.. అన్నీ ఉన్న గుర్రంపై రేసు గెలిస్తే అందులో ఏముంటుంది కిక్కు.. ఏమీ లేని కుంటి గుర్రంతోనే రేస్ గెలిస్తే మజా ఉంటుందని అనుకన్నారట. అలా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ టాలెంటును గమనించాడు రాజమౌళి. అలా ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. ఇక అప్పుడు ఏర్పడిన పరిచయం ఎన్టీఆర్ ను రాజమౌళి పాన్ ఇండియా స్టార్ గా చేసే వరకు వచ్చింది.

also read;

Visitors Are Also Reading