ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం.. ప్రాణాలు తీయడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ఇటీవలే నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరసనగండ్ల ప్రాంతానికి చెందిన నవీన్ అనే యువకుడు తన స్నేహితుడు హరిహరకృష్ణ చేతిలో చనిపోయిన విషయం విదితమే. ఈ ఘటన మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కానీ ఈ ఘటన 5 నెలల ముందే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read : కరివేపాకు రసంతో అద్భుతమైన ప్రయోజనాలు.. తీసుకోకుంటే వారు నష్టపోయినట్టే..!
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్రానగర్ గ్రామపంచాయితీ పరిధిలోని వెంకటేశ్వరకాలనీలో సంచార కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ నివాసముండే చిన్న వెంకటరమణ కుమారుడు కార్తీక్ (22), బాపట్లరాజు (22) స్నేహితులు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకి చెందిన ఓ యువతి తరచూ రాజు ఇంటికి వచ్చే అయితే ఆమెను ఇద్దరూ ప్రేమించారు. అయితే రాజు ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. తనకు కాబోయే భార్యను ప్రేమిస్తున్నాడని కార్తీక్ పై అతను కక్ష పెంచుకున్నాడు. తన తమ్ముడు బొజ్జ హరీష్ తో కలిసి ప్లాన్ వేశాడు. సెప్టెంబర్ 20, 2022 నందిపేట్ శివారులోని ఎల్లమ్మగుడి వద్ద కార్తిక్ కి మద్యం తాపించారు. సమీపంలో ఉన్నటువంటి విజయనగరం గుట్ట వద్దకు తీసుకెళ్లి.. తలపై కర్రతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఆ గుట్ట ప్రాంతంలో బండరాళ్ల మధ్యలో శవాన్ని పారేసి వెళ్లిపోయారు. ఆ తరువాత ఆ యువతిని రాజు పెళ్లి చేసుకున్నాడు.
Advertisement
Also Read : చిరంజీవి లవ్ మేటర్ సురేఖకు తెలిసి ఏం చేసిందో తెలుసా..?
తన కుమారుడు కనిపించకపోవడంతో బతుకు దెరువు కోసం ఏపీ వెళ్లి ఉంటాడని.. తల్లి చిన్న వెంకటరమణ భావించారు. ఆమెకు భర్త కూడా లేడు. పెద్ద కుమారుడి సాయంతో ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన Ha త్య మాదిరిగానే తమ గ్రామంలో కూడా జరిగిందని.. కార్తీక్ ను చంపి విజయనగరం గుట్ట ప్రాంతంలో పడేశారని స్థానిక యువకులు అతని తల్లికి సమాచారం ఇచ్చారు. గుట్ట ప్రాంతంలో అస్థిపంజరం కనిపించింది. ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకొని అస్థిపంజరానికి పోస్టుమార్టం నిర్వహించారు. కార్తీక్ అని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన నిందితులు పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు వెల్లడిస్తున్నారు పోలీసులు.