వేకువజామునే బ్రహ్మ ముహూర్తం లో మేల్కొని కావు కావు మని అరుస్తూ అందరినీ మేల్కొల్పే పక్షి కాకి. కాకికి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అది ఒక్కటే తినకుండా మిగతా కాకులను కూడా తీసుకు వచ్చి ఆహారాన్ని అందిస్తుంది.అంత స్నేహపూర్వకంగా మెదులుతాయి కాకులు. శత్రువులను కూడా వెంటనే గుర్తించి అన్ని కాకులకు సందేశాన్ని ఇచ్చి ఒక సంఘటితంగా ఉండటం లో కాకులు ముందుంటాయి. ఆడ కాకి,మగ కాకి కలవడం కూడా ఎవరీ కంటపడకుండా చాలా గోప్యంగా కలుస్తాయట. అంత మంచి జ్ఞానం కలిగి ఉండటం ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి రోదిస్తూ ఆ తర్వాత స్నానమాచరించి గూటికి చేరే ఆచరణ కాకులకు ఉంటుందట. సూర్యాస్తమయం తర్వాత ఎట్టిపరిస్థితుల్లో ఆహారం ముట్టని గుణం కాకులకు ఉంటుందట. కాకులు అరుస్తుంటే ఎవరో బంధువులు వస్తారు అని అనుకుంటారు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు కూడా భూమి కంపించే ముందు కాకులు సూచనలిస్తూ ఎగురుతూ వైపరీత్యాలను సూచిస్తాయి. సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక అవి స్నానం చేస్తాయట. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు.
Advertisement
Advertisement
మానవ జీవిత పరిణామం లో కొన్ని తరాల ను గుర్తు పెట్టుకునేది కాకి. ఎక్కువకాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా వివరించారు. అలాగే కాకి గురించి మనం చిన్నప్పుడు కుండలో అట్టడుగు భాగాలలో ఉన్న నీళ్లను రాళ్ళు వేసి పైకి తీసుకు వచ్చి సాగిందనే కథ విన్నాం. అంతటి సాంకేతిక విజ్ఞానం కూడా దాగి ఉంటుంది. ప్రస్తుతం అంతరించిపోతున్న కాకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది.
ALSO READ;
వామ్మో ఫస్ట్ లుక్ చూసి కేక అనుకున్నాం..కానీ ఆ రెండు సినిమాల కాపీ నా ఇది ?
రాజమౌళి ఆస్తుల విలువ అన్ని కోట్లా…? ఆయనదగ్గర ఉన్న ఈ ఖరీదైన వస్తువుల గురించి తెలుసా..?