కేంద్ర ప్రభుత్వం రైతులకు ఓ శుభవార్తను చెప్పేసింది. జనవరి 23న కిసాన్ సమ్మన్ నిధి యోజన 13వ విడుతకు సంబంధించిన డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకోసం పలు పథకాలను తీసుకొచ్చింది. వాటిలో భాగంగానే 2019లో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది.
Advertisement
కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6వేలు చొప్పు.. మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం విధితమే. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటివరకు 12 విడుతలుగా నగదును రైతులకు అందించారు. 13వ విడుత పీఎం కిసాన్ నగదు కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోష్ జయంతి సందర్భంగా ఆ రోజు రైతుల ఖాతాలలో రూ.2000 చొప్పున జమచేయనున్నట్టు సమాచారం. మరోవైపు రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని.. ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ లేని వారికి 13 విడుత డబ్బులు రావని హెచ్చరిస్తున్నారు.
Advertisement
Also Read : మొట్టమొదటి ల్యాప్ టాప్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. పీఎం కిసాన్ నగదు రూ.6వేల నుంచి మరింత పెంచాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 01న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ నగదును పెంచే యోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం.. ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందిస్తున్న వార్షిక ఆర్థిక ప్రయోజనాన్ని రూ.8వేలకు పెంచే అవకాశం ఉన్నట్టు పేర్కొంటున్నారు. రూ.8వేలను అర్హులైన వారి ఖాతాలో 4 సమాన వాయిదాల్లో పంపిణీ చేయనున్నట్టు వార్తలు వినిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.
Also Read : మనిషి నవ్వడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం మీకు తెలుసా..?