ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరిచిపోలేని ఘట్టం. ఈ తంతును ఎవరైనా జీవితాంతం గుర్తుండేలా చేసుకోవాలనుకుంటారు. దానికోసం ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే స్పెషల్ గా చేసుకుంటారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం పెళ్లి అంటే వారు కలలుకంటారు. ఈ విధమైన బట్టలు వేసుకోవాలి. ఇన్ని నగలు కొనుక్కోవాలి. ఇలా ఎన్నో ప్లాన్లు వేసుకొని పెళ్లి కుదిరింది మొదలు పీట లెక్కే వరకు వారి అందచందాలపై, అలంకరణపై దృష్టి పెడుతుంటారు.
Advertisement
కానీ ఇక్కడ వధువు మాత్రం చాలా స్పెషల్ గా ఆలోచించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక పెళ్లి కూతురు వివాహం కోసం చాలా అందంగా రెడీ అయిపోయింది. ఒంటినిండా ధగధగ మెరిసే బంగారు ఆభరణాలు వేసుకుంది. భారీ లెహంగా ధరించి ఆ పెళ్లి మండపంలోకి వచ్చేముందు తన ఫిట్ నెస్ స్కిల్స్ ను అందరి ముందు ప్రదర్శించింది. ధనాధన్ పుషప్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
Advertisement
Fitness with a difference. A bride doing pushups with lehenga and jewellery,,, pic.twitter.com/WQYYiubnVN
— dinesh akula (@dineshakula) April 14, 2022
అంతేకాకుండా తన కండలను చూపిస్తూ నవ్వుకుంటూ మండపానికి వచ్చింది. అలాగే లెహంగా చాలా బరువుగా ఉంది. ఇలాంటి వేసుకుని వ్యాయామం చేయడం చాలా కష్టం అంటూ మండపంలో అడుగు పెట్టింది. అయితే పెళ్లికి వచ్చిన వారంతా ఈ ఘటనను చూసి ఆశ్చర్యపోయారు. చాలామంది తమ మొబైల్ ఫోన్లలో ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారి పోవడంతో వధువును కామెంట్లతో నెటిజన్లు ముంచెత్తుతున్నారు.
ఇది కూడా చదవండి:
మహిళకు స్కానింగ్ చేసిన డాక్టర్లు.. రిపోర్ట్ చూసి షాక్..!
తన భర్త గౌతమ్ కిచ్లు కోసం ఎమోషనల్ అయినా కాజల్.. ఏమంటుందంటే..!!