పుష్ప ది రైజ్ మూవీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. తన మిత్రుడు దేవీశ్రీ ప్రసాద్ తో కలిసి అవార్డును తీసుకోవడం చాలా సంతోషంగా ఉందననారు. ఈ సినిమాలో నటనకు మంచి గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే సుకుమార్ చాలా శ్రమించారని తాజాగా జరిగిన ఓ పార్టీలో చెప్పారు. బాలీవుడ్ కి వెళ్లమని దేవీ శ్రీ ప్రసాద్ కి ఎన్నో సార్లు చెప్పాను. దాదాపు 20 ఏళ్లలో ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు. నేను ఆ మాట చెప్పిన ప్రతీసారి ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు నేను వచ్చేస్తాను అనేవాడు. అతని మాటలు విని.. మనకెక్క సాధ్యం అవుతుందిలే అనుకునేవాడిని.
Advertisement
Advertisement
అలాంటిది మేమిద్దరం ఒకేసారి పుష్ప మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. అక్కడా మంచి విజయాన్ని అందుకున్నాం. దాదాపు 20 ఏళ్ల నుంచి దేవీతో అంటున్న ఆ మాట నిజమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే.. ఏరా ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికీ వెళ్లి టీసీలు తీసుకోవమే తప్పా.. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి మెడల్ తీసుకుంటుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా ? అని అన్నారు. ముఖ్యంగా జీవితంలోని ప్రతిదశలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటానని తెలిపారు.
ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని సాధారణంగా మనం అనుకుంటుంటాం. జాతీయ అవార్డు అందుకున్న తరువాత నాకు తెలిసిన విషయం ఏంటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటూనే ఏదైనా సరే జరుగుతుందని తెలిపారు. జాతీయ అవార్డు అందుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తనకు అవార్డు రావాలని సుకుమార్ మరెంతగానో కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు లభించింది. ఆయనే అఛీవర్.. నేను కేవలం అఛీవ్ మెంట్ మాత్రమేనని వెల్లడించారు అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.