Home » పుష్య మాసం ప్రారంభం.. ఏలినాటి శని దోష నివారణకు ఏవిధంగా పూజ చేయాలో తెలుసా ?

పుష్య మాసం ప్రారంభం.. ఏలినాటి శని దోష నివారణకు ఏవిధంగా పూజ చేయాలో తెలుసా ?

by Anji
Ad

ఈ ఏడాది పుష్య మాసం తెలుగు క్యాలెండర్ లో పదోనెల. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసాన్ని పుష్య మాసం అని పిలుస్తారు. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగిందని అర్థం. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా లలో పుష్య మాసాన్ని పాటిస్తారు. పుష్య మాసం పెళ్లిళ్లు..  గృహ ప్రవేశం, నిశ్చితార్థాలు మొదలైన కొన్ని రకాల ఆచారాలకు అశుభకరమైన మాసంగా పరిగణించబడుతుంది.  ఈ ఏడాది జనవరి 12, 2024న పుష్య మాసం ప్రారంభమై.. ఫిబ్రవరి 09, 2024న ముగుస్తుంది. శుక్లపక్షం జనవరి 12న ప్రారంభమై.. జనవరి 25న ముగుస్తుంది.   2024లో  పుష్య మాసంలో కృష్ణ పక్షం జనవరి 26న ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగుస్తుంది.

Advertisement

పుష్య మాసంలో  భోగి, సంక్రాంతి , పుష్య నవరాత్రి లేదా శాకంబరి నవరాత్రి, కనుమ, ముక్కనుమ, త్యాగరాజ ఆరాధన, శటిల ఏకాదశి తెలుగు క్యాలెండర్‌లోముఖ్యమైన పండుగలు.  శీతాకాలంలో వచ్చే పుష్య మాసం.. ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించే వారు దోష రహితులుగా మారతారని విశ్వాసం.  పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా పండితులు చెబుతున్నారు.

Advertisement

ఏలినాటి శని దోష నివారణకు చేసే పూజ : 

  • ఎవరి జాతకంలో ఏలినాటి శని నడుస్తోందో.. వారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్ధించాలి. పౌర్ణమి రోజు తెల్లవారు జామునే లేచి శనికి తైలాభిషేకం చేయించి.. నవ్వులు దానమివ్వాలి. ఆ రోజు నువ్వులు , బెల్లం ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీని వెనుక శాస్త్రీయ కోణం చుస్తే ఈ రెండూ పదార్ధాలు శరీరంలో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.
  • శనీశ్వరుడు కర్మ ప్రదాయ.. మనిషి చేసే కర్మలను బట్టి మంచి చెడు ఫలితాలను ఇస్తాడు. ఈ నెలలో నియమ నిష్ఠులు పాటించి శనీశ్వరుడిని పూజిస్తే శని అనుగ్రహం పొందవచ్చు.
  • గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యతకు శని ప్రభావమే కారణం అని చెబుతారు.
  • పుష్యమాసం మొదటి పక్షం రోజులు శ్రీ మహా విష్ణువుని పూజిస్తారు. ఎవరైతే పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తారో వారు మానసిక ప్రశాంతతో జీవిస్తారని నమ్మకం.
  • పుష్య సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారం రోజున సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ పూజిస్తారు.
  • పుష్య మాసం శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం.
  • పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక గల కారణం అని చెప్పవచ్చు.
Visitors Are Also Reading