కృష్ణా జలాలలో అదనపు నీటిని వాడకుండా తెలంగాణను అడ్డుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు ( కేఆర్ఎంబీ)కి మరోసారి లేఖ రాసింది. కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కొంతకాలంగా వాగ్వాదం జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటా వివాదం తారాస్థాయికి చేరింది. ఈ తరుణంలో కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రాసిన లేఖ మరో వివాదంగా మారనున్నది.
Advertisement
Advertisement
తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ జలాలను విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంటుందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. గత ఏడాది వర్షాకాలం రాకముందే నాగార్జున సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి తరుచుగా నీటిని వాడుకోవడం వల్ల పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉన్న సిల్ప్ వే రేడియల్ గేట్లను తెరిచి మూసివేయాల్సి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. దీంతో స్పిల్ వే గేట్ నెంబర్ 16 కొట్టుకుపోయిందని.. ఇప్పటికీ గేటు వేయలేదని గుర్తు చేసారు.