విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ప్రజలకు ఇలవేల్పు గా ఉండి, తెలుగు అనే పదానికి వన్నెతెచ్చిన ధీరుడు నందమూరి తారక రామారావు. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టి అసమాన్య శక్తిగా ఎదిగి, మహోన్నత శిఖరాలను అధిరోహించిన ఘనత ఆయనదే. తెలుగు టాకీ పుట్టడానికి ఎనిమిది సంవత్సరాల ముందు తారక రామారావు జన్మించారు.
Advertisement
Advertisement
తెలుగు సినిమా వయసు పెరిగినా కొద్ది పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన వ్యక్తి. ఎలాంటి పాత్రలోనైనా దూసుకుపోయే ఆయన విలక్షణ నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆయన వేర్వేరు పాత్రలు చేస్తే ఆ పాత్రలను ఆయన చేశారా ఇంకా ఎవరినైనా తీసుకు వచ్చారా అని అనుమానం మనకి కలుగుతుంది. అంతటి మహానుభావుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..?తెలుగు చిత్రసీమలో తారక రామారావు సృష్టించిన సంచలనం మామూలుగా లేదు. చారిత్రక, పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో ఆయన పోషించినటువంటి పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేనివి. అడవి రాముడు, సర్దార్ పాపారాయుడు, వేటగాడు, యమగోల, బొబ్బిలి పులి సోషల్ హిట్ సినిమాలు మాయాబజార్, దాన వీర శూర కర్ణ, లవకుశ, శ్రీకృష్ణ పాండవీయం, ఫోక్ లోర్ హిట్స్, బొబ్బిలి యుద్ధం, మహామంత్రి తిమ్మరుసు వంటి హిస్టారికల్ హిట్స్ అందుకొని అన్ని రకాల చిత్రాల్లో ఎదురులేని నటుడిగా ఎదిగారు. అలాగే రాముడు, రావణుని వేషం, శ్రీ కృష్ణుడి వేషం, దుర్యోధనుని వేషం ఇలా ఏ పాత్ర అయినా సరికొత్తగా నటించింది ఆయనే.రజనీకాంత్ జీవితాన్ని మార్చేసిన సలహా..!
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఆయన కండక్టర్ గా పని చేసే సమయంలో వారి స్టాప్ అంతా కలిసి ఒకసారి పౌరాణిక నాటకం ప్రదర్శించారు. అందులో దుర్యోధనుని పాత్ర రజినీకాంత్ ది. దీని కోసం ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవీయం అనే మూవీని చూసి అందులో ఎన్టీఆర్ ఏ విధంగా నటించారో ఆ విధంగానే రజిని ప్రయత్నించారు. దీంతో ఆ నాటకం విజయవంతమైంది. చాలామంది రజనీకాంత్ ను చాలా బాగా చేశావ్ సినిమాల్లో చేయొచ్చు కదా అని సలహా ఇచ్చారు. దింతో రజిని మనసు ఇండస్ట్రీ వైపు మళ్ళింది. ముందుగా తన అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్ తో కలిసి టైగర్ అనే మూవీలో చేశారు. ఈ టైంలో ఎన్టీఆర్ తెలుగు మరియు తమిళం మూవీస్ లో చాలా బిజీగా ఉండేవారు. ఈ తరుణంలో అటు సినిమాలు ఇటు అలవాట్లు.. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది అని రజినీకాంత్ చెప్పారు. అయితే తారక రామారావు ఇది గమనించి, సోదర.. తెల్లవారుజామున మూడున్నర నుండి 4 గంటల మధ్య కాలాన్ని బ్రహ్మ కాలం అని పిలుస్తారు. ఆ టైంలో నువ్వు ప్రాణాయామం చేస్తే పూర్తిగా కోలుకుంటారు అని సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు రజినీకాంత్ అలాగే చేశారు. కొద్దిరోజులకే మామూలు మనిషి అయ్యాడు రజిని.
ఇవి కూడా చదవండి : 25 ఏళ్లుగా హీరో వెంకటేష్ రోజా మధ్య మాటలు లేకపోవడానకి కారణం అదేనా..?
తారకరత్న భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తుందంటే…!