తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండావచ్చి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికి ఒక పాఠం లాంటిది. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనేకమంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఆయనను ఆదర్శంగా తీసుకున్నావారు ఎంతోమంది. ఆ రేంజ్ లో ఆయన ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు.
Advertisement
అంతటి పేరు సంపాదించుకున్న చిరంజీవి ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలిగి ఉంటాడు. తనతో పని చేసిన ప్రతి ఆర్టిస్టుతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్నేహభావంతో ఉంటాడు. అందుకే చిరంజీవిని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. ఇటీవల ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మి చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ రోజుల్లో చిరంజీవితో కలిసి విజేత అనే సినిమా చేశానని చెప్పింది. ఇందులో చిరంజీవికి వదినగా ఆమె నటించిందట.
Advertisement
అందులోని ఒక సన్నివేశంలో శ్రీ లక్ష్మీ తెగిపోయిన తన చెప్పులను చిరంజీవి చేతికి ఇచ్చి కుట్టించుకొని రమ్మంటుంది. ఈ సీన్ చూసిన మెగాస్టార్ అభిమానులు తన ఇంటి ముందు ధర్నా చేశారని, ఆ సీన్ పెద్ద దుమారమే రేపింది అని తెలియజేసింది. కానీ చిరంజీవి మాత్రం మా అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని అన్నది. షూటింగ్లో బ్రేక్ సమయంలో అందరం ఒకే చోట కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళమంటూ శ్రీలక్ష్మి చెప్పుకొచ్చింది.
also read: