సినీ నటుడు తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. అయితే మొదటి రోజే తారకరత్న కార్యకర్తలతో కలిసి నడుస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అనంతరం సిబ్బంది కార్యకర్తలు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఎక్మో ద్వారా ప్రస్తుతం తారకరత్న కు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తారకరత్న ఆరోగ్యం పై రకరకాల అనుమానాలు మొదలవుతున్నాయి. అంతేకాకుండా తారకరత్న ను పరామర్శించిన కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు.. ఒక్కో విధంగా చెబుతున్నారు. ఒకరు తారక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతుంటే….. మరొకరు ఆయన వైద్యానికి సహకరిస్తున్నారని కోలుకుంటారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే నేడు తారకరత్న చికిత్సలో కీలకమైన రోజుగా తెలుస్తోంది.
Advertisement
ఈనెల 27న తారకరత్న గుండెపోటుకు గురికాగా అప్పటినుంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా నేడు తారకరత్నకు పలు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఎమ్మారై స్కానింగ్ తీయబోతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఆ స్కానింగ్ ఆధారంగా ట్రీట్మెంట్ ను మొదలు పెట్టబోతున్నారని సమాచారం. ఏది ఏమైనా తారక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కార్యకర్తలు కోరుకుంటున్నారు.
Also read : రెండో పెళ్లికి రెడీ అంటున్న 7/g బృందావన్ కాలనీ హీరోయిన్..మరీ ఇంత లేటుగా !