నందమూరి తారకరత్న 39 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఆకస్మాత్తుగా కన్నుమూయడం నిజంగా బాధాకరం. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం కోసం తారకరత్న జనవరి 27న కుప్పం వచ్చారు. ఒక మసీదులో ప్రార్థనలో నిర్వహించి బయటకు వస్తుండగా కొంత దూరం నడిచిన తర్వాత ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకులిపోయారు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లిన బతకలేకపోయారు. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Also Read: తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి కోసం ఎన్టీఆర్ భార్య ప్రణతి ఏం చేసిందో తెలుసా ?
Advertisement
Also Read: ఆస్తిలో తారకరత్న వాటాను ఆ ట్రస్ట్ కు రాశారా… అలేఖ్య రెడ్డికి అన్యాయమేనా?
Advertisement
జీవితాంతం తోడుంటాడు అనుకున్న భర్త అద్దాంతరంగా కన్నుమూయడంతో ఆమె ఆవేదన వర్ణనాతీతం. ఇదిలా ఉంటే తారకరత్న ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలో తారకరత్న భార్య తిరిగి కోలుకునేలా చేయడానికి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆమెను బిజీగా ఉంచడానికి రాజకీయాల్లోకి తీసుకురావాలని బాలయ్య ఆలోచిస్తున్నారట. తద్వారా రాజకీయాల్లోకి రావాలన్న తారకరత్న కోరికను అలేఖ్య ద్వారా తీరేలా చంద్రబాబుతో సమాలోచనలు చేస్తున్నారట బాలయ్య.
మొదట తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంలో అలేఖ్యకు కీలక పదవి వచ్చేలా చేసి, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం ఏమీ లేదు. కాగా సినిమాల్లో టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న, రాజకీయాల్లోకి రావాలని ఎన్నో కలలుకన్నాడు. ఎమ్మెల్యే పోటీ చేయాలని అనుకున్నా, విధి వెక్కిరించింది.
READ ALSO : ‘నీ స్నేహం’ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా ?