నందమూరి హీరో తారకరత్న నిన్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో శుక్రవారం తారకరత్న పాల్గొన్నారు. లక్ష్మీపురం వరద రాజ స్వామి గుడిలో నారా లోకేష్ తో కలిసి తారకరత్న కూడా పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ కార్యకర్తలు ప్రజలతో కలిసి తారకరత్న నడుస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలారు.
Advertisement
వెంటనే కార్యకర్తలు సిబ్బంది తారకరత్నను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బెంగళూరు నుండి వచ్చిన వైద్య బృందం ఆధునిక పరికరాలతో తారకరత్నకు చికిత్స అందించింది. అనంతరం తారకరత్న ను బెంగుళూరు కు తరలించారు.
Advertisement
కాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి బృందం తారకత్న ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తారకరత్నకు ఏక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. హెల్త్ బులిటెన్ లో తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించింది.
కార్డియాలజిస్టులు, ఇంటెన్సివ్విస్టులు ఇతర స్పెషలిస్టులతో తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ట్రీట్మెంట్ కొనగిస్తున్నామని ప్రకటించింది. ఇక తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన అభిమానులు టిడిపి కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Also read :వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో హిట్ కొట్టిన నాగార్జున.. ఆ సినిమా ఏదంటే?