Home » Tarakaratna: నాన్న ఒక్కసారి అమ్మ అని పిలవరా..కన్నీటితో వీడ్కోలు పలికిన తల్లి..!!

Tarakaratna: నాన్న ఒక్కసారి అమ్మ అని పిలవరా..కన్నీటితో వీడ్కోలు పలికిన తల్లి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

నవ మాసాలు మోసి జన్మనిచ్చిన కన్న కొడుకు కళ్ళ ముందే ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతుంటే ఆ తల్లి వేదన వర్ణించలేం.. ఆ తల్లిదండ్రులు ఇంట్లోనే కూర్చుని కొడుకు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అంటూ టీవీల్లో వస్తుంటే కళ్ళ నుంచి కన్నీటి ధార పారుతూనే ఉంది. 23 రోజులుగా కడుపారా కన్నా కొడుకును ఆ పరిస్థితుల్లో చూసి ఆ కన్నతల్లి పేగు కరిగిపోయింది. నా ‘తారకరత్నుడు’ మళ్లీ ఎలాగైనా తిరిగి వస్తాడని ఆ కన్న తండ్రి ఆశతో ఎదురు చూశాడు. భుజాలపై ఎత్తుకొని పెంచిన నా కొడుకు ఆ హృదయాలయ ఆసుపత్రిలో హృదయ వేదనతో కొట్టుకుంటుంటే ఆ కన్న తండ్రి గుండె తట్టుకోలేకపోయింది.

Advertisement

ఆ 23 రోజులు కొడుకు వస్తాడని మళ్లీ చూస్తామని ఆ ఇద్దరూ ముసలి తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కొడుకుని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడ్ని చేసిన తర్వాత తల్లిదండ్రులను కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఆ తల్లిదండ్రులను కాస్త వేదనతో పాటుగా, కోపానికి గురిచేసింది. ఆ చిన్న కోపమే వారి మధ్య ఎడబాటును పెంచింది తప్ప ప్రేమను దూరం చేయలేకపోయింది. చివరికి కొడుకు కన్నుమూశాడని తెలిసి తట్టుకోలేని ఆ గుండెలు చివరి క్షణాల్లో అయినా కొడుకును చూసుకోవాలని హుటా హుటిన వచ్చేసారు.

Advertisement

కొడుకు పార్థివ దేహాన్ని చూసి కన్నీరు మున్నిరుగా విలపించారు. అమ్మను వచ్చానురా లేరా నాన్న..గోరుముద్దలు పెట్టి గొప్పవాణ్ణి చేసానురా.. మాకు తలకొరివి పెడతావని ఆశించాను రా.. మా ఆశలను అడియాశలు చేసి అమ్మ నాన్నలను వదిలి అనంత లోకాలకు వెళ్ళావా నా కొడుకా అంటూ కన్నీటి పర్యంతమైయ్యారు ఆ కన్న తల్లిదండ్రులు.. తన తల్లి కన్నీరు పెడుతుంటే అక్కడ ఉన్న వారంతా టీవీల్లో చూస్తున్న వారంతా ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విధంగా తారక రత్న తల్లిదండ్రులు మోహనకృష్ణ, శాంతి కొడుకుకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.

also read:

Visitors Are Also Reading