ప్రజలకు వినోదం అందించడమే మంచి సాధనం. తమ కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమిస్తారు. కొన్ని సార్లు తమ అభిమాన నటీనటులు ధరించే దుస్తులను, స్టైల్ను అనుకరిస్తున్నారు. ఒకొక్కసారి వెండి తెరపై విలన్ క్యారెక్టర్ లో నటించే నటీనటులను కొంతమంది ద్వేషిస్తుంటారు. తమ మధ్యకు అలాంటి వారు వస్తే.. ఆ క్యారెక్టర్ ను గుర్తు చేసుకుని కొట్టడానికి కూడా వెనకాడరు. ఇటువంటి అనుభవం గురించి ప్రముఖ సీనియర్ నటుడు తనికెళ్ళ భరణికి కూడా ఎదురైంది అట.
Advertisement
రంగస్థల నుంచి వెండి తెరపై సినిమా రచయితగా అడుగుపెట్టిన అనంతరం నటుడిగా మారిన తనికెళ్ల భరిణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనికెళ్ల భరణి శివ భక్తుడు. తెలుగు భాషాభిమాని. తెలుగు సినిమాల్లో హాస్య ప్రధాన పాత్రలో నటించే తనికెళ్ల భరణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గురించి చెప్పారు. తనను కొంత మంది మహిళలు తిట్టడం కాదు, ఏకంగా చంపేస్తాం అని కూడా బెదిరించారు అని వెల్లడించారు.
Advertisement
అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఊహ హీరోయిన్‌గా తెరకెక్కించిన ఆమె సినిమాలో తనికెళ్ల భరణి కూడా కీలక పాత్రలో నటించారు. భర్త చనిపోయి మరదలిపై కన్నేసిన ఊహ బావగా తనికెళ్ల భరిణి నటించారు. ఆ సినిమాలో ఊహ ఉద్యోగం వస్తే డబ్బుల కోసం ఆశపడుతూ బలవంతంగా తాళి కడతాడు. ఆమె సినిమా విడుదల అయిన తరువాత తనికెళ్ల భరణి నటనకు ఎంత మంచి పేరు వచ్చిందో బయట ఎక్కడ తనికెళ్ల భరణిని చూసినా అక్కడ కొంత మంది మహిళలు కొట్టడానికి ప్రయత్నించారు అని చెప్పుకొచ్చారు. కొంతమంది మహిళలు అయితే ఏకంగా చంపేస్తాం అని బెదిరించారని చెప్పారు. ఆ సినిమాలోని నా క్యారెక్టర్ అసలు నిజమే కాదు అన్నా జనం మాత్రం వినిపించుకునే వారు కాదు అని, జనానికి సినిమా అంటే అంత పిచ్చి అంటూ చెప్పారు తనికెళ్ల భరణి.