Home » తమ్ముడు మూవీ లో కనిపించిన ఈ కమెడియన్ గుర్తున్నాడా? తరువాత ఏ రేంజ్ కి వెళ్ళాడో చూడండి!

తమ్ముడు మూవీ లో కనిపించిన ఈ కమెడియన్ గుర్తున్నాడా? తరువాత ఏ రేంజ్ కి వెళ్ళాడో చూడండి!

by Srilakshmi Bharathi
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో “తమ్ముడు” సినిమాకు ఓ ప్రత్యేకమైన రేంజ్ ఉంది. పవన్ కళ్యాణ్ కు సూపర్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా “తమ్ముడు”. అలానే, ఈ సినిమా కామెడీ ట్రాక్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ కామెడీ ట్రాక్ కి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ ట్రాక్ తాలూకు పిక్స్ ను మీమ్స్ కి కూడా వాడుతూ ఉంటారు.

jumanji tammudu movie

Advertisement

అయితే ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన “జుమాంజి” క్యారక్టర్ గుర్తుందా? లావుగా ఉండి, ముఖమంతా జుట్టుతో కప్పబడి ఉన్న ఈ పాత్ర సినిమా చివరివరకు నవ్వులు పూయిస్తూనే ఉంటుంది. అయితే ఈ పాత్రలో నటించిన నటుడు మాత్రం ఎవరికీ తెలియదు. ఈ పాత్ర లో నటించిన వ్యక్తి పేరు శివ. ఈ సినిమా దర్శకుడు పీ అరుణ్‌ ప్రసాద్‌ కు శివ స్నేహితుడు. ఆ చనువుతోనే ఓ పాత్ర చేయాల్సింది గా శివ ని అడిగారు.

Advertisement

jumanji tammudu movie

కేవలం ఫ్రెండ్ కోసమే ఈ సినిమాలో నటించిన శివ మరే ఇతర సినిమా లోనూ కనిపించలేదు. అదే ఆయనకు మొదటి, చివరి సినిమా. ఈ సినిమా తరువాత ఓ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగంలో చేరిన శివ నాలుగేళ్ళ క్రితం సొంతంగా సాఫ్ట్ వేర్ సంస్థని స్థాపించారు. ప్రస్తుతం ఆ కంపెనీ సూపర్ సక్సెస్ తో నడుస్తోంది. నటుడు అలీనే ఈ విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

అప్సర కేసులో ట్విస్ట్…సీన్ లోకి కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో !

అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

ఆ ఊర్లో వింత ఆచారం… మొదటి రాత్రి భార్యతో పాటు అత్త కూడా…!

Visitors Are Also Reading