టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో చాలామంది ప్రముఖులు మరణించారు. 2020 అంటే కరోనా మహమ్మారి విజ్రూంభించినప్పటి నుంచి ఇప్పటివరకు చాలామంది ప్రముఖ నటులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. నిన్న నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. నందమూరి తారకరత్న మరణించారు. అయితే, ఈ సంఘటన మరువకముందే, మరో నటుడు మృతి చెందారు.
Advertisement
ప్రముఖ కమెడియన్ మైలస్వామి (57) కన్నుమూశారు. ఆయన మృతితో తమిళ ఇండస్ట్రీలో తీవ్రవిషాదం నెలకొంది. అనారోగ్య సమస్యలతో ఆయన కాలం చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మైలస్వామిని కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికి మైల స్వామి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Advertisement
మైలస్వామి మృతి పట్ల తమిళ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సినిమాలతో మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిత్వానికి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మైలస్వామి సినిమాల్లోకి రాకముందు మిమిక్రీ చేసేవారు. 1984లో ఆయన తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పాత్ర సంబంధం లేకుండా తనకు అందివచ్చిన పాత్రకు న్యాయం చేసేవారు. 2000 సంవత్సరం తర్వాత ఆయనకు చాలా సినిమాల్లో కమెడియన్ గా పాత్ర దొరికింది. ఆ తర్వాత ఆయన కమెడియన్ గానే కొనసాగారు.
READ ALSO : “ఎన్టీఆర్” నుండి “చిరంజీవి” వరకు…మహా శివుడి పాత్రలలో మెప్పించిన టాలీవుడ్ హీరోలు!