కరోనాకు వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదని ముందు నుండి ఆరోగ్య నిపుణులు…శాస్త్ర వేత్తలు మొత్తుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వేసుకోవడంలో మాత్రం ప్రజలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి చాలా కాలం గడుస్తున్నా ఇప్పటికీ వ్యాక్సిన్లు వేసుకోని వారి సంఖ్య చాలానే కనిపిస్తుంది. ఇక కొందరు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ లు తీసుకోగా సెకండ్ డోస్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సెకండ్ డోస్ తీసుకోని వారి సంఖ్య ఇప్పటికీ భారీగానే ఉంది. ఇది ఇలా ఉంటే మరోవైపు ఆఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోందని ఆందోళన చెందుతున్నారు.
Advertisement
ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు భారత్ లోనూ నమోదు అయ్యాయి. మొదటగా బెంగుళూరులో ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా ఆ తరవాత హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల్లోనూ నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ను మరింత పక్కాగా అమలు చేస్తోంది. ఇంటికి వచ్చి మరీ ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ లను ఇస్తున్నారు. ఇక కొంతమంది ఎంతకీ వ్యాక్సిన్ లు వేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో కొన్ని చోట్ల ఆఫర్ ప్రకటించడం కూడా చూస్తూనే ఉన్నాం.
Advertisement
Also read : ఒమిక్రాన్ వచ్చిన ఇద్దరి లక్షణాలు చెప్పిన కేంద్రం…అంత ప్రమాదకరమా…?
రీసెంట్ గా మధ్య ప్రదేశ్ లోని ఓ నగరంలో వ్యాక్సిన్ వేసుకున్న వారికి మద్యం పై 10శాతం డిస్కౌంట్ ప్రకటించారు. ఇక తాజాగా గుజరాత్ లోని రాజ్ కోట్ నగర పాలక సంస్థ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మరో బంపరాఫర్ ప్రకటించింది. డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 10 మధ్య వాక్సిన్ తీసుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా రూ.50 వేల స్మార్ట్ ఫోన్ ను గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించింది. అంతే కాకుండా ఈ తేదీల మధ్యన ఎక్కువ మందికి వ్యాక్సిన్ లు వేసిన హెల్త్ కేర్ సెంటర్ లకు రూ.21 వేలు అందిస్తామని ప్రకటించింది.