Home » డిప్రెషన్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు..? ఎలాంటి లక్షణాలు కనపడతాయి…?

డిప్రెషన్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు..? ఎలాంటి లక్షణాలు కనపడతాయి…?

by Sravya
Ad

చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు..? డిప్రెషన్ అంటే ఏంటి..? డిప్రెషన్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది ఈ రోజుల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మానసిక ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతోంది. ఒత్తిడి పెరిగి డిప్రెషన్ గా మారుతోంది. డిప్రెషన్ ని ఎదుర్కొంటున్న వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉంటాయి. మూడ్ తరచుగా మారుతూ ఉండడం, అకస్మాత్తుగా చిరాకు రావడం, పని మీద ఆసక్తి లేకపోవడం, ఎల్లప్పుడూ వ్యక్తులకు దూరంగా ఉండడం, ఒంటరిగా ఉండాలనుకోవడం, విచారంగా ఉండడం, హఠాత్తుగా ఏడవడం వంటివి డిప్రెషన్ యొక్క లక్షణాలు అని చెప్పొచ్చు.

Advertisement

Advertisement

శారీరక ఆరోగ్యం కూడా కొంతవరకు మానసిక ఆరోగ్యంతో లింక్ అయి ఉంటుంది. చెడు మానసిక ఆరోగ్య లక్షణాలు శరీరంపై కూడా ప్రభావితం చూపిస్తాయి. డిప్రెషన్ ఉంటే శారీరకంగా కూడా కొన్ని మార్పులు వస్తాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఉంటాయి. డిప్రెషన్ ఉన్నట్లయితే తగినంత నిద్ర అవసరం. రోజు ధ్యానం, యోగ వంటివి చేస్తూ ఉండండి. కౌన్సిలింగ్ ద్వారా డిప్రెషన్ నుండి బయటపడవచ్చు.

Also read:

Visitors Are Also Reading