భారత పర్యటనను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-2తో కోల్పోయిన ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్ ను మాత్రం 2-1తో కైవసం చేసుకుంది. చెన్నై వేదికగా బుధవారం జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. అయితే ఈ సిరీస్ లో టీమిండియాకు అది పెద్ద మైనస్ ఏంటంటే అది సూర్య కుమార్ యాదవ్. మూడు మ్యాచుల్లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయి గోల్డెన్ డక్స్ లో హ్యాట్రిక్ క్రియేట్ చేసిన తొలి బ్యాటర్ గా సూర్య చెత్త రికార్డు సృష్టించాడు.
READ ALSO : Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!
Advertisement
సచిన్ కూడా వరుసగా 3 వన్డేల్లో డక్ అవుట్ అయినా రెండో బంతికే అవుట్ అయ్యాడు. కానీ సూర్య మాత్రం మూడు వన్డేల్లో తొలి బంతికే అవుట్ అయ్యాడు. అయితే ఇక్కడ సూర్యకు టాలెంట్ లేదని, అతను జట్టులో వేస్ట్ అని అనడం లేదు. అతని సామర్థ్యం, బలం ఏంటో గుర్తించమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం ప్రపంచం నెంబర్ వన్ టి20 బ్యాటర్. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్.
Advertisement
READ ALSO : కత్తిలాంటి వాడు, నిత్య పెళ్లి కొడుకు… నరేష్ పై రాజేంద్రప్రసాద్ సంచలనం!
టి20 క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న క్రమంలో ఒక భారత బ్యాటర్ వరల్డ్ నెంబర్ వన్ గా ఉన్నాడు. అంటే కచ్చితంగా పెద్ద విషయమే. అలాంటి ప్లేయర్ ను బలవంతంగా వన్డేలు ఆడిస్తూ అతని కెరీర్ మొత్తాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. అదేవిధంగా మూడు వన్డేల సిరీస్ లో మూడు సార్లు డక్ అవుట్ అయిన మొదటి భారత బ్యాటర్ కూడా సూర్యనే. ఇక ఓవరాల్ గా వన్డేల్లో వరుసగా మూడుసార్లు డక్ అవుట్ అయినా ఆరవ భారత బ్యాటర్ గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు.
READ ALSO : తిరుమల భక్తులకు అలర్ట్….నడకదారి భక్తులకు దర్శనం టికెట్స్