వరుస పరాజయాలతో ఐపీఎల్ 2022 ను ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు… వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వీకెండ్ సందర్భంగా నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ జట్టుతో పోటీ పడింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
Advertisement
ఇక మయాంక్ అగర్వాల్ కు గాయం కావడంతో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మొదట బ్యారింగ్ కు వచ్చిన పంజాబ్ జట్టును సన్ రైజర్స్ బౌలర్లు హట్టి దెబ్బ కొట్టారు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టును లివింగ్‌స్టోన్ ఆదుకున్నాడు. 33 బంతుల్లో 60 పరుగులతో దూకుడు మీద ఉన్న లివింగ్‌స్టోన్ ను భువనేశ్వర్ పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఆ తర్వాత లోయర్ ఆర్డర్ లో ఎవరు రాణించకపోగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నాలుగు వికెట్లు పడటంతో పంజాబ్ 151 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.
Advertisement
అయితే 152 టార్గెట్ తో వచ్చిన సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ 3 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (34), ఓపెనర్ అభిషేక్ శర్మ (31) తో రాణించారు. వీరు ఔట్ అయిన వెంటనే ఐడెన్ మార్క్రామ్ (41), నికోలస్ పురాన్ (35) తో నెమ్మదిగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జట్టుకు 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. ఇక ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి సన్ రైజర్స్ వెళ్లగా.. ఓడిన పంజాబ్ 7వ స్థానానికి వచ్చింది.
ఇది కూడా చదవండి :
ఐపీఎల్ or లవర్ : మీ సమాధానం ఏంటి..?
బట్లర్ క్రీడాస్ఫూర్తికి అభిమనులు ఫిదా…!