Ad
ఐపీఎల్ 2022 లో దారుణంగా ఆడుతున్నా జట్టు ఏదైనా ఉంది అంటే అది ముంబై ఇండియన్స్ జట్టే. ఎందుకంటే ఇప్పటికే ఆడిన 8 మ్యాచ్ లలో ఒక్క విజయం కూడా అందుకోకుండా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది ఆ జట్టు. ఇక ఈ ఐపీఎల్ కోసం జరిగిన మేజ్ వేలంలో 15.25 కోట్లు పెట్టి తీసుకున్న ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమవుతున్నాడు. మొదటి రెండు మ్యాచ్ లలో చేసిన అర్ధశతాకాలు మినహా.. మిగిలిన అన్ని మ్యాచ్ లలో విఫలమయ్యాడు.
నిన్న కూడా లక్నోతో జరిగిన మ్యాచ్ లో 20 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేసాడు. ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా పెవిలియాన్ చేరుకున్నాడు. ఇక ఇషాన్ వైఫల్యం పై తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… లక్నోతో మ్యాచ్ లో ఇషాన్ గ్రౌండ్ లో బ్యాటింగ్ చేయడం కంటే బయటికి వెళ్ళడానికే ఎక్కువ ఆసక్తిని చూపించాడు. అక్కడ అంపైర్ ఔట్ ఇవ్వకపోయిన… పెవిలియన్ వైపుకు బయలుదేరాడు. అది అతని మనస్తత్వాన్ని తెలియజేస్తుంది అన్నాడు.
ఇక ఇషాన్ చాలా రోజులుగా షాట్ పిచ్ బంతులకు భయపడుతున్నాడు. నిన్న కూడా ఒక్క బంతి హెల్మెట్ ను తాకగానే అతను భయపడినట్లు అర్ధం అవుతుంది. ఇలా ఆయితే రేపు విదేశాలలో పేస్ పిచ్ ల పైన అందరూ ఆ బంతులే వేస్తారు. ఎవరు కూడా బ్యాటర్ కు పరుగులు రావాలని చూడరు. అతడిని భయపెట్టి ఔట్ చేయాలనే అనుకుంటారు అని సునీల్ గవాస్కర్ అన్నారు.
ఇవి కూడా చదవండి :
Advertisement