టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోలతో పోటీ పడిన హీరో సుమన్. తన అందం నటనతో సుమన్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సుమన్ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూకట్టేవారు. చిరంజీవి లాంటి హీరోతో సుమన్ కు పోటీ ఉండేది. కరాటే లో బ్లాక్ బెల్ట్ అందంలో ఆకట్టుకునే విధంగా ఉండటంతో సుమన్ అతితక్కువకాలంలో తన మార్క్ ను వేసుకున్నారు. ఇక స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో సుమన్ ఇంటిపై పోలీసుల రైడ్ జరిగింది.
Advertisement
దాంతో ఆ వార్త న్యూస్ పేపర్ లలో హెడ్ లైన్ గా మారింది. ఆ కేసు నుండి బయటపడటానికి సుమన్ కు చాలా రోజులు పట్టింది. ఆ కేసు వల్ల సుమన్ జైలు జీవితాన్ని సైతం గడపాల్సి వచ్చింది. అయితే గతంలో సుమన్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడానికి తన వద్ద సమాధానం లేదని అన్నారు. పోలీసుల దగ్గర కూడా సమాధానం లేదని అన్నారు. తనను సైదాబాద్ కోర్టులో హాజరుపరిచారని అన్నారు.
Advertisement
అమ్మాయిలను వేధించినట్టు…బ్లాఫిల్మ్ లు తీసినట్టు ఆరోపించి కేసులు వేశారని చెప్పారు. కానీ ఎవరిదగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆధారాలు అడిగితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పేవారని అన్నారు. యాంటి గుండా యాక్ట్, ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం వల్ల తనకు బెయిల్ కూడా దొరకలేదని చెప్పారు. తనను దారుణమైన గదిలో జైలులో బంధించారని చెప్పారు.
ఓ మంచి కుంటుంబంలో పుట్టిన తనను ఎంతో ఇబ్బంది పెట్టారని అన్నారు. జైలులో తనకు తానే ధైర్యం చెప్పుకున్నానని అన్నారు. ఓసారి కరుణానిధి గారు వచ్చి తన పరిస్థితి చలించిపోయారని అన్నారు. జైలు అధికారులను హెచ్చరించి తనను వేరే గదికి మార్పించారని చెప్పారు. ఇదిలా ఉండగా తనపై ఓ జరిగిన ఓ పొలిటికల్ కుట్ర వల్లే జైలు జీవితం అనుభవించాల్సి వచ్చిందన్నారు. అయితే సుమన్ ఇప్పటి వరకూ వాళ్లు ఎవరా అన్నది మాత్రం బయటపెట్టలేదు. కరుణానిధి, ఎంజేఆర్ లాంటి వాళ్లే తనకు సాయం చేయలేకపోయారని బాధపడ్డారు.
ALSO READ :
ఉదయ్ కిరణ్ చనిపోయేముందు కాళ్లు పట్టుకుని ఏడ్చాడు…నటి ఎమోషనల్..!
సూపర్ స్టార్ కృష్ణ ఫోటో వైరల్.. టెన్షన్ పడుతున్న అభిమానులు..!