Home » శీతాకాలంలో కీళ్ళ వాపు, నొప్పులతో బాధపడుతున్నారా? వీటిని తింటే అద్భుతమైన ఫలితం..!

శీతాకాలంలో కీళ్ళ వాపు, నొప్పులతో బాధపడుతున్నారా? వీటిని తింటే అద్భుతమైన ఫలితం..!

by Anji
Ad

చలికాలంలో పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక ఖరీజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తాయి. అలాగే పచ్చి ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.


చలికాలంలో చాలామందికి ఎముకలు, కీళ్ల నొప్పులు మొదలవుతాయి. కీళ్ల వాపు, నొప్పులతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడే అనేక పోషకాలు పచ్చి ఉల్లిపాయలో ఉన్నాయి. విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మొదలైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పి నివారిణిగా పనిచేస్తాయి.

Advertisement

Advertisement


పచ్చి ఉల్లిపాయలో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉల్లిపాయ జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఉల్లి రోజూవారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఉల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ లు శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి.

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ పచ్చి ఉల్లిపాయల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గుతో పోరాటం లో సహాయపడతాయి. విటమిన్ సి శరీరం ఇన్ఫెక్షన్లు, వైరస్లతో పోరాడటానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారించి, ఫైటో కెమికల్స్ వైరస్, బ్యాక్టీరియాలను చంపుతాయి.

Visitors Are Also Reading