Home » పేపర్ లీక్ పై ఓ నిరుద్యోగి స్పంద‌న‌…కండ్ల వెంట నీళ్లు రావ‌డం గ్యారెంటీ..!

పేపర్ లీక్ పై ఓ నిరుద్యోగి స్పంద‌న‌…కండ్ల వెంట నీళ్లు రావ‌డం గ్యారెంటీ..!

by AJAY
Published: Last Updated on
Ad

తాజాగా తెలంగాణ లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప‌రీక్ష‌కు సంబంధించిన ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ క‌ల‌క‌లం రేపుతోంది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తున్న న‌లుగురు ఉద్యోగులే లీకేజీకి కార‌ణం అని చైర్మెన్ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. కాగా పేపర్ లీకేజీ నేప‌థ్యంలో పోటీప‌రీక్ష‌ల‌కు సిద్దం అవుతున్న నిరుద్యోగులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. తాజాగా ఓ విద్యార్థి పేపర్ లీకేజీ పై ఎమోష‌న‌ల్ లేఖ‌ను సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇక ఆ విద్యార్థి రాసిన లేఖ చ‌దివితే క‌న్నీళ్లు పెట్ట‌కుండా ఉండ‌లేరు.

ALSO READ :  ఇన్స్టాగ్రామ్ లో వేధింపులు..అడ్ర‌స్ క‌నుక్కుని వెళ్లి మ‌హిళ ఏం చేసిదంటే..?

Advertisement

ఆ లేఖ‌లో ఏం రాశారంటే…పరీక్ష పేపర్లు లీక్ చేసే ముర్కులారా మా నిరుద్యోగుల బాధ మీకు ఏమైనా తెలుసా..? నా పుస్తకాలను అడుగూ ఒక్కొక్క పేజీని…ఎన్ని సార్లు చదివానో……నా చెప్పులను అడుగూ ఎన్ని సార్లు గ్రంథాలయం చుట్టూ తిరగానో…నా కడుపును అడుగూ ఎన్ని సార్లు కొచింగ్ సెంటర్లో అర్ధాకలితో కూర్చున్ననో…నా కళ్ళను అడుగూ ఎన్ని రాత్రులు నిద్రపోకుండా పుస్తకాలతో రాత్రి పగలు కాపురం చేసానో…..

Advertisement

నా మనసును అడుగూ ఎన్ని పండుగలను వదులుకొని ఒంటరిగా అద్దెగదిలో అనాథగా బ్రతికనో…నా గది మెట్లను అడుగు ఎన్ని సార్లు తడపడుతూ తెగబడుతూ కూడా పైకి పైకి ఎక్కనో….నా ఊపిరిని అడుగూ ఎన్ని సార్లు వధులుకోవలని అమ్మ నవ్వు .నాన్న గౌరవం కోసం వధులుకోలేకపోయానో…..

నా పరీక్షలను అడుగూ చిన్న చిన్నగా వెనక నుండి మునుముందుకు ఎలా వచ్చనో…..నా చేతులను అడుగూ రాసిన వాక్యాన్ని చేసిన లెక్కను ఎన్ని సార్లు చేసానో……నా పగవాళ్ళను అడుగూ నేను తడబడుతున్న వేల సార్లు నన్నుచూసి ఎంత ఆనందంతో నవ్వుకున్నారో…నా ఒక్క మార్కును అడుగు ఎన్ని సార్లు నన్ను ఈ పోటీ ప్రపంచం నుండి దూరంగా విసిరేసిందో…….

నా ATM కార్డును అడుగూ నాన్న పంపిన డబ్బులు తియ్యడానికి తినడానికి ఎన్ని సార్లు సచ్చిబ్రతికనో….నా భుజాలపైన దురదృష్టం ఎక్కి కూర్చుంటే నేను ఎంత ప్రయత్నించిన ఎంత ప్రయాణించిన వ్యర్థమేనేమో ….కానీ కోరిక చావడం లేదు ఆశ తీరడం లేదు…అంటూ లేఖ‌లో విద్యార్థి పేర్కొన్నాడు.

ALSO READ : క్యూట్‌‌గా స్మైల్ ఇస్తున్న ఈ చిన్నోడు.. ఫస్ట్ మూవీతోనే తోపు యాక్టర్ అయ్యాడు.. ఎవరో గుర్తుపట్టారా?

Visitors Are Also Reading