Home » క్యూట్‌‌గా స్మైల్ ఇస్తున్న ఈ చిన్నోడు.. ఫస్ట్ మూవీతోనే తోపు యాక్టర్ అయ్యాడు.. ఎవరో గుర్తుపట్టారా?

క్యూట్‌‌గా స్మైల్ ఇస్తున్న ఈ చిన్నోడు.. ఫస్ట్ మూవీతోనే తోపు యాక్టర్ అయ్యాడు.. ఎవరో గుర్తుపట్టారా?

by Bunty
Ad

ఉప్పెన చిత్రంతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన మెగా క్యాంప్ హీరో పంజా వైష్ణవి తేజ్. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా కెరీర్ స్టార్ట్ చేసిన వైష్ణవ్ కి ఉప్పెన చిత్రం బ్లాక్ బస్టర్ తో మంచి గుర్తింపే దక్కింది. అయితే ఆ సక్సెస్ ను ఈ కుర్ర హీరో కంటిన్యూ చేయలేకపోయాడు.

Advertisement

 

ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన కొండ పొలం, రంగా రంగా వైభవంగా సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో వైష్ణవ్ కి హిట్ కొట్టి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏమాత్రం తేడా కొట్టిన ఉన్న ఇమేజ్ కాస్త పోతుందనే భయం ఎలాగో ఉంటుంది. దీంతో వైష్ణవ్ తేజ్ ఈసారి రూట్ మార్చాడు. మాస్ అవతార్ లో మెప్పించడానికి రెడీ అయ్యాడు.

Advertisement

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను మేకర్స్ అనౌన్స్ చేశారు. శ్రీకాంత్ ఎన్.రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. మెగాస్టార్ కూతురు పక్కన కూర్చొని… వైష్ణవ్ తేజ్ స్మైల్ ఇస్తున్నాడు. ఈ ఫోటో వైష్ణవ్ తేజ్ చిన్నతనంలోనిది.

 

Read Also : భూమా మౌనిక వీపుపై సీక్రెట్ టాటూ… మనోజ్ ఆగ్రహం ?

Visitors Are Also Reading