ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ లతో చాలా మంది కన్నుమూస్తున్నారు. ప్రతి రోజు కనీసం ఒక్క వార్త అయినా వినిపించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ తరవాత గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. మరోవైపు చిన్న వయసులోనే గుండె పోటుతో చనిపోతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చనిపోతున్నారు.
ALSO READ : లవర్ కోసం కలెక్టర్ అయ్యాడు.! కోట్ల జీతం వదిలి కొత్త జీవితంలోకి….!
Advertisement
అంతే కాకుండా సడెన్ గా చనిపోవడం కలవరపెడుతోంది. రీసెంట్ గా నందమూరి తారకరత్న 40 ఏళ్ల వయసులోనే గుండె పోటుతో మరణించాడు. అంతకముందు బాలీవుడ్ యంగ్ హీరో ఒకరు జిమ్ చేసి పడుకుని ఆ తరవాత హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. అంతే కాకుండా ఇటీవల ఐదవరగతి బాలిక స్కూల్ లో చనిపోయింది. మరో ఇంటర్ విద్యార్థి కాలేజీలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అదే విధంగా హైదారబాద్ లో 24 ఏళ్ల కానిస్టేబుల్ జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు.
Advertisement
ఇ తాజాగా మరో యువకుడు కూడా అలానే మరణించాడు. అనంతపూర్ కు చెందిన తేజూ నాయక్ అనే యువకుడు స్నేహితులతో కలిసి కబడ్డీ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి వెనక్కిపడిపోయాడు. దాంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మార్చి1న జరగ్గా అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తేజు నాయక్ కన్నుమూశాడు. ప్రస్తుతం తేజు నాయక్ బీ ఫార్మసీ చదువుతున్నట్టు సమాచారం. అంతే కాకుండా అతడి వయసు కూడా కేవలం 19 సంవత్సరాలని తెలుస్తోంది.