మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు విడుదలైంది. సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో నటించగా చిరంజీవి ఆచార్య అనే పాత్రలో నటించారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో….. ధర్మస్థలి అనే ఆలయ క్షేత్రా
సంరక్షించే స్టోరీ లైన్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించింది.అదేవిధంగా చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు ప్రకటించారు. ఐదు రోజుల వరకు షూటింగ్ కూడా జరిపారు. కానీ తీరా సినిమా విడుదల సమయంలో కాజల్ సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. మెగా స్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరు సినిమా లో ఉండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమాపై ముందు నుండే నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా విడుదలైన తర్వాత నెగెటివ్ ప్రచారం మరింత పెరిగిపోయింది.
Advertisement
Advertisement
ఇదివరకు ఏ సినిమాకు లేనంతగా నెగిటివ్ ప్రచారం ఆచార్యకు కనిపించింది. నిజానికి చాలా సినిమాలు వస్తుంటాయి ఫ్లాప్ అవుతుంటాయి. కానీ ఇంత దారుణంగా నెగిటివ్ ప్రచారం జరగలేదు. అయితే ఈ నెగిటివ్ ప్రచారానికి కారణం ఏపీ ప్రభుత్వం చిరంజీవి సినిమాకు అనుకూలంగా టికెట్ ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించడమేనని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా అలా ప్రచారం చేస్తున్న వారు కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారే అంటూ ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక నెగెటివ్ ప్రచారం… ట్రోలింగ్ తో ఇప్పటికే సినిమాకు చాలా నష్టం కూడా జరిగిపోయింది. సినిమా చూడాలని అనుకున్న వారు కూడా ఈ ప్రచారం వల్ల థియేటర్లకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో సినిమాలో నటించిన హీరోల తో సినిమాను నమ్ముకున్న టెక్నీషియన్స్ నటీనటులు, నిర్మాతలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది.
Also read :
తండ్రి మృతి పై హీరో నిఖిల్ ఎమోషనల్…కన్నీళ్లు పెట్టిస్తున్న పోస్ట్….!