Home » SR.NTR తెలుగు ఫేస్, ఆయనకు అంత సీన్ లేదంటూ అవమానించిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

SR.NTR తెలుగు ఫేస్, ఆయనకు అంత సీన్ లేదంటూ అవమానించిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ చేయని పాత్రలు లేవు. ఇక్కడ ఆయన సినిమా వచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురిసేది. అలాంటి ఎన్టీఆర్ బాలీవుడ్లో కూడా నేరుగా సినిమా తీయాలని అనుకునేవారట. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ మార్కెట్ అంతా దక్షిణాదికే పరిమితం అయి ఉండటం వల్ల అక్కడ పెద్దగా వసూలు రావని భావించేవారు. కానీ అన్న గారు నటించిన “ఆరాధన” సినిమా హిందీలోకి డబ్ చేసి విడుదల చేశారు కాసుల వర్షం కురిపించింది. అయినా నిర్మాతలు నమ్మలేదు. దీనికి కారణం ఏంటనేది తేల్చుకోవడానికి ఒక పది రోజులు బొంబాయిలోనే మకాం వేశారు అన్నగారు..

Advertisement

also read:మ‌హేశ్ బాబు కెరీర్ బెస్ట్ “ఒక్క‌డు” సినిమాను మిస్ చేసుకున్న‌ స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఎలా మిస్ అయ్యిందంటే..?

Advertisement

అప్పట్లో హిందీ ఇండస్ట్రీని ఏలిన అగ్రహీరోయిన్ వహీదా రెహమాన్.. ఈవిడ అన్నగారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. అప్పట్లో బాలీవుడ్ లో కొంతమంది అగ్ర హీరో హీరోయిన్ల సినీరంగాన్ని శాసించేవారు. వారు చెప్పిందే వినాలనే పోకడలు కొన్నాళ్ళు సాగాయి. ఈ క్రమంలోనే హీరోయిన్ వహీదా అన్న గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసేదట.. ఆయనవల్ల మార్కెట్ ఉండదని, తాను నటించానని చెప్పేవారట.. అది తెలుగు ఫేస్ ఇక్కడ ఎవరు చూస్తారని కూడా వ్యతిరేక ప్రచారం చేపట్టిందట. దీనిపై ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు.. కారణమేంటంటే పరిశీలిస్తే.. వహీదా తెలుగు చిత్రమైన “రోజులు మారాయి”లో ఒక ఐటెం సాంగ్ లో నటించారు.. “ఏరువాక సాగరో”.. ఈ పాటకు అప్పట్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనుకోండి..

ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ ఛాన్సులు కూడా వచ్చాయి. కానీ అన్నగారు వ్యతిరేకించారు. మన తెలుగులోనే సావిత్రి, అంజలి లాంటి మెరుపు తారలు ఉండగా అక్కడి వారితో సినిమాలు తీయడం ఎందుకని చెప్పేసరికి, నిర్మాతలు ఆమెకు ఇచ్చిన అడ్వాన్సులు కూడా వెనక్కి తీసుకున్నారట.. దీంతో నేరుగా ముంబై వెళ్లిన వహీదా అక్కడ ఇండస్ట్రీనీ ఏలే స్థాయికి చేరుకున్నారు.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పై ఈ విధమైన ప్రచారం చేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి.

also read:

Visitors Are Also Reading