కొంతమంది హీరోలు ఒక సినిమా చేస్తే.. రూ.100 కోట్లు.. అంటే రోజుకు ఒక్క కాల్షీట్ కోటి రూపాయిలు వసూలు చేస్తున్నారు. ఒకేసారి మల్టీపుల్ మూవీస్‌తో పాటు బ్రాండ్ ఓపెనింగ్స్ కి కూడా మినిమం కోటి తీసుకుంటున్నారు. ఇలా కోట్లకు కోట్లు డబ్బులు సినిమాలతో వచ్చే డబ్బులే కాదు. యాడ్, టీవీ షోలు,ఇలా రకరకాలుగా డబ్బులు సంపాదిస్తుంటారు. మనస్టార్లు.. ఇంతకు ఈ కోట్ల రూపాయలు ఏమి చేస్తున్నారు..? అసలు ఎలా ఖర్చు చేస్తున్నారు..? ఎక్కడ దాచి పెడుతున్నారు..? అసలు ఈ డబ్బులు అన్ని ఏమి చేస్తున్నారో ఓసారి తెలుసుకుందాం.
ఒక్క సినిమాకు రెమ్యునరేషన్ కోట్లలో తీసుకుంటారు మనస్టార్ హీరోలు. కొంత మంది అయితే రోజుకు కోటి రూపాయలు వసూలు చేస్తుంటారు. వీటితో పాటు యాడ్స్, బ్రాండ్స్ ప్రమోట్ చేసినందుకు పై డబ్బులు కోట్లకు కోట్లు రానే వస్తున్నాయి. మరి కోట్ల రూపాయల డబ్బులన్నీ స్టార్లు ఏమి చేస్తారని డౌట్లు రావడం కామన్. ఒకప్పుడు స్టూడియోలు, రియల్ ఎస్టేట్స్‌లో ఇన్వెస్ట్‌చేసే స్టార్లు.. ఇప్పుడు ట్రెండ్‌కు తగినట్టు రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు.
Advertisement
టాలీవుడ్ లో 100 కోట్లకు పైగా హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్.. తన ఇన్‌కమ్ ని ఒకేచోట కాకుండా డిఫరెంట్ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రాస్ తన కోట్ల రెమ్యూనరేషన్ మూవీ ప్రొడక్షన్‌ను మేనేజర్‌గా స్పెండ్ చేస్తున్నారు. తన పెదనాన్న గోపికృష్ణ ప్రొడక్షన్తో పాటు యూవీ క్రియేషన్స్ లో మేజర్ షేర్ ఖర్చు పెడుతున్నారు ప్రభాస్. అంతేకాదు.. థియేటర్ల బిజినెస్ లోకి కూడా దిగిన ప్రభాస్ సొంత బాహుబలి మల్టీపుల్ థియేటర్లతో పాటు రియల్ ఎస్టేట్‌లో కూడా డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారు.
Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ తరువాత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ వరకు సినిమాకు రూ.50కోట్లు తీసుకునే పవన్‌స్టార్ ఇప్పుడు సినిమాకు రూ.60 కోట్లు తీసుకుంటున్నారు. అంతేకాదు.. కాల్షీట్ కోటి నుంచి రెండు కోట్లు ప్రైస్ ఫిక్స్ చేసిన ఈ హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నా.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం లేదు. ప్రస్తుతం తీసుకున్న జనసేన పార్టీని మెయింటెన్ చేయడానికి తన రెమ్యునరేషన్ మొత్తం స్పెండ్ చేస్తున్నారు ఈ జనసేనాని.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు ఎన్నికోట్లు సంపాదించినా నమ్రత వాటన్నింటిని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటుంది. మహేష్ బాబు తన 50 కోట్ల రెమ్యూనరేషన్‌తో పాటు రియల్ ఎస్టేట్ యాడ్స్.. క్లాతింగ్ బ్రాండ్, టాప్ బ్రాండింగ్ యాడ్స్‌తో సంపాదించే డబ్బు అంతా మేజర్ ప్రొడక్షన్ కే స్పెండ్ చేస్తున్నారు. తన మహేష్‌బాబు ప్రొడక్షన్‌తో సినిమాలు చేస్తున్న మహేష్‌బాబు.. రియల్ ఎస్టేట్‌లో కూడా డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. అటు సినిమాల మీద ఫోకస్ చేస్తూనే మరోవైపు థియేటర్ల బిజినెస్ కూడా సూపర్బ్‌గా చేస్తున్నారు. మెస్ట్ లావిష్ క్యాంపస్‌తో పాటు లగ్జరీ థియేటర్లు మహేష్‌బాబు సొంతం. ఏషియల్ గ్రూపుతో కలిసి మహేష్బాబు గచ్చిబౌలిలో ఉ్న ఏఎంబీ మల్టీప్లెక్స్ స్టార్ సెలబ్రిటీస్‌కి మూవీ అడ్డాగా మారిపోయింది.
Also Read : Srఎన్టీఆర్ గారి ఇల్లు ఇప్పుడు ఎలాంటి దుస్థితిలో ఉందొ తెలుసా ?