Home » Srఎన్టీఆర్ గారి ఇల్లు ఇప్పుడు ఎలాంటి దుస్థితిలో ఉందొ తెలుసా ?

Srఎన్టీఆర్ గారి ఇల్లు ఇప్పుడు ఎలాంటి దుస్థితిలో ఉందొ తెలుసా ?

by AJAY
Ad

ప్ర‌తిఒక్క‌రూ పుడ‌తారు…చ‌నిపోతారు. కానీ కొంత‌మందే చ‌నిపోయిన త‌ర‌వాత కూడా ప్ర‌జ‌ల హృదయాల్లో నిలిచిపోతారు. అలాంటి మ‌హ‌నీయుల్లోఒక‌రు ఎన్టీఆర్. నాట‌క‌రంగంలో గుర్తింపు తెచ్చుకుని ఆ త‌ర‌వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు. సినీరంగంలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. కుటుంబ క‌థా చిత్రాల‌తో పాటూ పౌరాణిక సినిమాల‌లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

పౌరాణిక పాత్ర‌ల‌తో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. అయితే ఎన్టీఆర్ త‌న సినిమాల స‌మయంలో చెన్నై లో కూడా నివాసాన్ని ఏర్పర‌చుకున్నారు. అర్థ‌శ‌తాబ్దం పాటూ అక్క‌డే నివ‌సించారు కూడా. చెన్నైలోని పాండిబ‌జార్ కు ద‌గ్గ‌ర‌లో ఎన్టీఆర్ ఇంటిని నిర్మించుకున్నారు. అక్క‌డ ఎన్టీఆర్ కు ఎన్నో గుర్తులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ఇంటిని పట్టించుకునే నాథుడు కూడా లేక‌పోవ‌డంతో ఆ ఇల్లు శితిలావ‌స్థ‌కు చేరుకుంది.

Advertisement

కానీ ఒక‌ప్పుడు ఇది ద‌ర్శ‌నీయ స్థ‌లంగా కూడా ప్ర‌సిద్ది చెందింది. ఎన్టీఆర్ పౌరాణిక పాత్ర‌ల‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న త‌ర‌వాత ఆయ‌న‌ను కూడా దేవుడిలా కొల‌వ‌డం ప్రారంభించారు. తిరుప‌తి వెళ్లినవాళ్లు మ‌ద్రాసు లోని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయ‌న‌ను ద‌ర్శించుకునేవారు. త‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లిన వాళ్ల‌ను ఎన్టీఆర్ కూడా ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించేవార‌ట‌. దాంతో వాళ్లు చాలా సంతోషంగా తిరుగు ప్ర‌యాణం అయ్యేవారు. ఎన్టీఆర్ మ‌ర‌ణించిన త‌ర‌వాత కూడా కొన్నేళ్ల‌పాటు ఎన్టీఆర్ నివాసం అంటూ ఈ ఇల్లు ద‌ర్శ‌నీయ‌ప్ర‌దేశంగా ప్ర‌సిద్ది చెందింది.

కానీ ఇప్పుడు ఆ ఇల్లు శితిలావ‌స్థ‌కు చేరుకుంది. 1960ల‌లో ఎన్టీఆర్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ త‌ర‌వాత కొన్ని మ‌ర‌మ‌త్తులు చేయించారు. నంద‌మూరి హౌస్ అని ఈ ఇంటికి పేరుంది. ఎన్టీఆర్ న‌టించిన…నిర్మించిన ఎన్నో సినిమాల‌కు క‌థ‌లు ఇక్క‌డే పుట్టాయి. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఎన్నో ఫంక్ష‌న్లు కూడా ఇక్క‌డ జ‌రిగాయి. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత ఎన్టీఆర్ ఈ ఇంటిని వ‌దిలి ఏపీకి చేరుకున్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ ఇల్లు శితిలావ‌స్థ‌కు చేరుకోవ‌డంతో మ‌ర‌మ‌త్తులు చేయించాల‌ని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.

Visitors Are Also Reading