తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ కమెడియన్స్ అనగానే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది కోవై సరళ మాత్రమే.. ఇక బ్రహ్మానందం కోవై సరళ కాంబోలో కామెడీ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. వీరిద్దరు కలిసి ఎన్నో చిత్రాల్లో కామెడీతో అదరగొట్టారు. కొన్ని చిత్రాలు వీరి కామెడీ వల్లే సక్సెస్ అయ్యాయని కూడా చెప్పవచ్చు.. అలాంటి కోవై సరళ స్క్రీన్ పై ఎంతో సక్సెస్ అందుకున్నా జీవితంలో మాత్రం సక్సెస్ ను అందుకోలేదు. ఇంకా కష్టాలు అనుభవిస్తూనే ఉంది.. సినిమాల్లో విజయవంతంగా రాణించిన ఆమె నిజ జీవితంలో అలా కావడానికి కారణాలు ఏంటో చూద్దాం.. క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రంలో బ్రహ్మానందం కోవై సరళ కామెడీ మర్చిపోలేం. వీరిద్దరూ తెలుగులో చేసిన ఎవడి గోల వాడిది, శ్రీరామచంద్రులు, ఎలా చెప్పను, సందడే సందడి, గ్రీకువీరుడు వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు కోవై సరళ.
Advertisement
also read:బాలయ్య, పవన్ కళ్యాణ్ షో ప్రసారమయ్యేది ఎప్పుడంటే..?
Advertisement
కేవలం కామెడీ పాత్రలే కాకుండా, సెంటిమెంట్ పాత్రలో కూడా అదరగొడతారు. ఏ క్యారెక్టర్లో అయినా సరే ఇట్టే ఒదిగిపోయే విలక్షన నటి కోవై సరళ. తన 35 ఏళ్ల సినీ జీవితంలో మూడో భాషల్లో కలిపి సుమారు 750 చిత్రాల్లో నటించారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అందరిని నవ్వించే ఆవిడ జీవితంలో నవ్వులు లేవని చెప్పాలి. ఇప్పటివరకు వివాహం కూడా చేసుకోలేదు. ప్రస్తుతం ఆవిడను పలకరించడానికి కూడా ఎవరూ లేరట. తన ఇంట్లో పెద్ద కూతురు కావడంతో, ఇంటి బాధ్యత ఆమెపై పడడంతో సినిమాల్లో ఎలాంటి పాత్ర వచ్చినా వదులుకోకుండా చేసి డబ్బు సంపాదించి తన చెల్లెల వివాహాలు చేశారు. వారంతా విదేశాలకు వెళ్లిపోయారు. కానీ సరళ మాత్రం పెళ్లి చేసుకోకుండా కుటుంబ భారాన్ని మోసుకుంటూ వచ్చింది.
ఆ ప్రభావం ప్రస్తుతం ఆమె జీవితం పై పడిందని చెప్పవచ్చు. ఈమె సంపాదించిన డబ్బుతో విదేశాలకు వెళ్లి బాగా సెటిలై ఉద్యోగాలు చేస్తున్న వారు, ఎప్పుడైతే సరళాకు ఆఫర్స్ రావడం తగ్గిపోయాయో అప్పటినుంచి ఆమెను చూసుకోవడం మానేశారు. 60 ఏళ్లు ఉన్న కోవై సరళ తో మాట్లాడడమే పాపం గా భావిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారట. కానీ సరళ మాత్రం తన చెల్లెళ్ల కుటుంబాలే ప్రాణంగా భావిస్తూ ఉంటుంది. అలాంటి సరళ కు వారి చెల్లెలు కోర్టు మెట్లు కూడా ఎక్కించారట. ఆస్తుల విషయంలో గొడవలు వచ్చి కోర్టులో కేసులు వేసి ఆమెను కోర్టుకు ఈడ్చడంతో తన దగ్గర ఏ ఆస్తి లేదని అంతా కుటుంబానికే ఖర్చు చేశానని సమాధానం ఇచ్చుకుందట సరళ. అంతటి త్యాగం చేసిన సరళ కు హాట్సాఫ్.. మరి దీనిపై మీ కామెంట్ తెలియజేయండి.
also read: