నందమూరి నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోకి హాజరై సందడి చేశారు. ఇటీవలే ప్రభాస్ ఎపిసోడ్ ఆహాలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఉంది.
Advertisement
ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాన్ షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో పవన్ అభిమానులు సంబురపడుతున్నారు. సాధారణంగా పవన్ అంటే రెండు వైపులా పదునున్న కత్తిలాంటి వాడని ఆయన అభిమానులు చెబుతుంటారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఈ రెండు విషయాలపై బాలయ్య ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి పవన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారనే విషయం పై కూడా నటసింహం ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది. ఇక వీరిద్దరి ప్రోమో ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తి అటు బాలయ్య, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Advertisement
Also Read : నిర్మాతగా మారి కైకాల సత్యనారాయణ గారు చిరంజీవి సినిమాలని నిర్మించారని కూడా తెలుసా ? ఏ సినిమా అంటే ?
అయితే ఆహా టీమ్ పవన్ ఎపిసోడ్ ని సంక్రాంతి స్పెషల్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు వాస్తవం అయితే ఈ ఎపిసోడ్ జనవరి 13న గ్రాండ్ గా ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారం కానుంది. బాలయ్య తన షోకి పవన్ కళ్యాణ్ ని ఎలాంటి ప్రశ్నలు వేశాడు.? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ బాలయ్య-పవన్ ఒకే వేదికపై ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలు డిస్కషన్ కి రావడం అభిమానులకు ఫుల్ మీల్సే అని చెప్పాలి. మొత్తానికి పవన్-బాలయ్య ఎపిసోడ్ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి.
Advertisement
Also Read : జలుబు లేదా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ ని గుర్తించడం ఎలా ? వీటికి తేడా ఏంటి..?