అతిలోకసుందరి శ్రీదేవి ప్రస్తుతం మన మధ్యన లేకపోయినా ఆమె చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేసుకుంది. ఎన్టీఆర్ లాంటి సీనియర్ హీరోల నుండి చిరంజీవి లాంటి హీరోల పక్కనా జోడీ కట్టింది. అప్పట్లో శ్రీదేవికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనేమో. హీరోను పట్టించుకోకుండా శ్రీదేవి కోసమే ప్రేక్షకులు థియేటర్ లకు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో అందం అభినయంతో శ్రీదేవి అదరగొట్టింది.
Advertisement
నటన డ్యాన్స్ ఇలా అన్నింటా తన టాలెంట్ ను నిరూపించుకుంది. అంతే కాకుండా శ్రీదేవి హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. తెలుగుతో పాటూ తమిళ హిందీ భాషల్లో కూడా శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. ఇదిలా ఉంటే శ్రీదేవి బోణీకపూర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా 2018లో శ్రీదేవి గుండెపోటుతో కన్నుమూసింది.
Advertisement
ఇక శ్రీదేవి వర్థంతి సందర్భంగా బోణీకపూర్ సోషల్ మీడియాలో తమ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. మొదటతమిళ సినిమాలో చూసి శ్రీదేవితో ఎలా అయినా సినిమా చేయాలని నిర్నయించుకున్నట్టు వెల్లడించారు. అప్పట్లో శ్రీదేవి 8 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటే ఆమె తల్లి సినిమాకు 10లక్షలు డిమాండ్ చేసిందన్నారు.
సినిమా పూర్తైన తరవాత 11 లక్షలు ఇచ్చి సర్ప్రైజ్ చేశానని అన్నారు. శ్రీదేవితో మొదటిసారి మాట్లాడినప్పుడే నచ్చిందన్నారు. ఆమెపై చాలా కేర్ తీసుకోవడంతో దగ్గరయ్యానని అన్నారు. తన భార్య మోనా శౌరీకి శ్రీదేవిపై ఉన్న ఫీలింగ్స్ చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చానని అన్నారు. ఆ తరవాత శ్రీదేవిని వివాహం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను బోణీకపూర్ షేర్ చేశారు.
ALSO READ :ఒకప్పటి నందమూరి హీరో ఇప్పుడు ఎలా మారిపోయాడో చూశారా..?