Home » సీతతో పోల్చుకున్న శ్రీరెడ్డి.. అభిరామ్ పెళ్లి గురించి ఏమందో తెలిస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ..!

సీతతో పోల్చుకున్న శ్రీరెడ్డి.. అభిరామ్ పెళ్లి గురించి ఏమందో తెలిస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ..!

by Anji
Published: Last Updated on
Ad

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూషల వివాహం శ్రీలంకలో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. అయితే పలువురు సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ పెద్దలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయగా.. ఒక మహిళ మాత్రం విచిత్రంగా స్పందించారు. ఆవిడ మరెవరో కాదండోయ్..  నటి శ్రీరెడ్డి. తాను కేరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దగ్గుబాటి అభిరామ్ తనను మోసం చేసినట్టు ఆరోపణలు చేసింది.

Advertisement

 

ఈ ఇష్యూ నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి అభిరామ్ పై , అతని కుటుంబంపై పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.  రాముడిని, సీతని విడదీసిన దేశం.. సీతాదేవి శాపాలకు నిలయం, ఆంజనేయ కోపాగ్నిలో తగలబడిన దేశం, అశోక వనంలో సీతమ్మా ,రాముని రాకకై తిండి మానేసి, స్నానం మానేసి దుఃఖితురాలైన ఆ రాక్షస రావణ లంక, శ్రీలంక లో “దగ్గుబాటి అభిరాం  పెళ్లి .. వహ్వా వహ్వా  మన దేశ ఆదర్శ జంట రాములవారిని, సీతమ్మ వారిని విడదీసిన దేశంలోనా నీ పెళ్లి ?? ఆహా!  దైవ నిర్ణయాన్ని గౌరవిస్తాను.. ఎప్పటికైనా రాక్షసులు రాక్షసులే ” అంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది.

దీనిపై నెటిజన్స్ రక రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేస్తున్నారు.  ఇక అభిరామ్, ప్రత్యూషల పెళ్లి వేడుకకు దగ్గుబాటి కుటుంబం తరలి వెళ్లింది. ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు మధ్య వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వధువు ప్రత్యూష దగ్గుబాటి కుటుంబానికి దగ్గర బంధువు అని ఆమె స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది. దగ్గుబాటి సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ ఇటీవలే హీరోగా ‘అహింస’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్నట్లుగా హిట్ కాలేదు. కొంత గ్యాప్ తర్వాత రెండో సినిమా చేసే అవకాశం ఉంది. దగ్గుబాటి రానా రజనీకాంత్ సినిమా ‘తలైవర్ 170’ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో ప్రాజెక్టు ‘హిరణ్యకశ్యప’ తో కూడా బిజీగా ఉన్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading