యూపీ లోక్సభ ఎన్నికల్లో జౌన్‌పూర్ స్థానం నుండి డిఎస్పీ తరఫున బరి లోకి దిగారు తెలుగు మహిళ శ్రీ కళా రెడ్డి. ఇప్పుడు ఆమె టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. ఆమె గతం లోనే 2004లో కోదాడ నుండి టీడీపీ తరఫున 2019లో బిజెపి నుండి హజూర్నగర్ లో బరి లోకి దిగుతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే యూపీ లో తన భర్త ధనుంజయ సింగ్ కి జైలు శిక్ష పడడం తో ఆమె పోటీ చేయలేకపోయారు. సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన కీసర జితేందర్ రెడ్డి ఏకైక కూతురు కళా రెడ్డి.
Advertisement
ప్రముఖ నిప్పోన్ బ్యాటరీల కంపెనీలు వీళ్ళ కుటుంబానివే. చెన్నై కేంద్రంగా వ్యాపారం సాగించడంతో శ్రీ కళా రెడ్డి ఇంటర్మీడియట్ ని అక్కడే పూర్తి చేశారు హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు. 2017లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ యూపీ కి చెందిన మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ కళ ని మూడవ భార్య కింద పెళ్లి చేసుకున్నారు.
Advertisement
Also read:
Also read:
మొదటి భార్య ఆత్మహత్య చేసుకున్నారు రెండో భార్యకి విడాకులు ఇచ్చేసారు. శ్రీ కళా రెడ్డి ఆయన మూడో భార్య. 2021 లో జాన్పూర్ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికల చైర్మన్ గా కళా రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. కిడ్నాప్ ఆక్రమ వసూళ్లు కేసు లో ధనుంజయ సింగ్ కి జైలు శిక్ష పడి జైల్లో ఉన్నారు. దీంతో బిఎస్పి శ్రీ కళా రెడ్డి ని బర్లోకి దింపింది. కళా రెడ్డి పేరు మీద 780 కోట్ల స్థిరాస్తులు, 6.71 కోట్ల చరాస్తులు, 1.74 కోట్ల ఆభరణాలు ఉన్నాయి. ధనుంజయ పేరు మీద 5.31 కోట్ల స్థిరాస్తులు, 3.56 కోట్ల చరస్తులు మాత్రమే వున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!