Home » ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఆ విలనేనా..?

ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఆ విలనేనా..?

by Sravanthi
Published: Last Updated on
Ad

ప్రస్తుతం రాజమౌళి సినిమాల్లో హీరో తో పాటుగా విలన్ ను కూడా ఎంత బలంగా చూపిస్తారో.. అప్పట్లో అన్న ఎన్టీఆర్ సినిమాల సమయంలో విలన్ రాజనాల ను కూడా హీరోతో పాటు గా అంత సమానంగా ప్రతినాయకుడి పాత్రలో చూపించేవారు.. అప్పట్లో ప్రతి నాయకుడు పాత్ర అంటే అందరికీ గుర్తుకొచ్చేది రాజనాల మాత్రమే.. ఆయన అంత బాగా నటించేవారు.. రాజనాల సినిమాల్లోనే విలన్ కానీ నిజ జీవితంలో మాత్రం ఆయనంత మంచి మనిషి ఇండస్ట్రీలో లేరని చెప్పవచ్చు.

Advertisement

మద్రాసులో ఆయనకు ఐదు భవంతులు ఉండేవి. ఆయనకు ఉన్న అయిదు కార్లు ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి. కావలిలో 32 ఎకరాల స్థలం ఉండేది. ఆర్థిక అవసరాల కోసం భూమిని కూడా అమ్మేసారు. ఆయన ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు గౌరవం చివరిరోజుల్లో లేకుండా పోయాయి. రాజనాల జీవితమంతా మద్రాసులోని టీ నగర్ తో ముడిపడి ఉండేది.

also read:సింగర్ మంగ్లీ గురించి ఈ నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఒక్క పాటకు ఎంతంటే..?

Advertisement

ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎవరో ఒకరు మద్రాస్ వెళ్లేవారు. ఇలా వెళ్ళిన వారిని రాజనాల తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకుని భోజనాలు పెట్టేవారు. ఇలా రాజనాల ఇంట్లో ప్రతిరోజు ఓ పాతిక మంది అయినా కడుపు నింపుకునే వారు. అప్పట్లో ఆయన ఇంటిని రాజనాల సత్రం అని కూడా పిలిచే వారట. ఆయన మొదటి భార్య శోభ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. ఎంతమంది వచ్చినా వచ్చిన వారికి లేదనకుండా అందరికీ కడుపు నింపేది. అలాగే మంచి టాలెంట్ ఉన్న పేద విద్యార్థులకు డబ్బు సాయం కూడా చేసేవారు. ఈ విధంగా రాజనాల కుటుంబమే ఒక దానధర్మాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందంటే వారు ఇలా ఉండే వారో అర్థం చేసుకోవచ్చు. ఆయన వద్దంటే డబ్బు చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించారు రాజనాల. ఇందులో రాజనాల పాత్ర ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ పాత్ర. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ రాజనాల ను మామాజీ అని పిలిచేవారు.

సినిమా పూర్తయినా కానీ ఆ పిలుపు మాత్రం అలాగే పిలిచేవారు.ఎన్టీఆర్ ఎవరికి పరిచయం చేసిన విలన్ మామాజీ అని పరిచయం చేసేవాడు. అలా ఇద్దరి మధ్య చాలా స్నేహం పెరిగింది.. ఎన్టీఆర్ కి ఏమాత్రం తీరిక దొరికినా రాజనాల ఇంటికి వెళ్ళేవారు. అప్పుడప్పుడు రాజనాల దంపతుల్ని తన ఇంటికి భోజనానికి కూడా పిలిచేవారు. ఇలా రాజనాల కెరియర్ మంచి స్టేజ్లో ఉన్నప్పుడు 32 ఏళ్ల లోనే రాజనాల భార్య శోభా మృతిచెందారు. ఆమె మరణంతో ఆయన సినిమా ఆఫర్స్ కూడా తగ్గాయి.. పరామర్శించడానికి వచ్చిన ఎన్టీఆర్ మీ లక్ష్మి వెళ్ళిపోయింది మామాజీ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఆరోజు నుంచి రాజనాలకు సంబంధించి ఏ కార్యక్రమమైనా ఎన్టీఆర్ చూసుకున్నారు. ఇలా సంవత్సరకాలం పాటు డిప్రెషన్లోకి వెళ్లిన ఆయన సినిమాలకు దూరమయ్యారు. పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో మళ్లీ భూదేవి అనే మహిళ ని వివాహం చేసుకున్నారు.

also read:

Visitors Are Also Reading