తెలుగు ఇండస్ట్రీ ని గగనతలంలో ఉంచిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్నగారు ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు. అప్పట్లో ఆయన సినిమా వచ్చింది అంటే సెన్సేషనల్ హిట్టే.. అలాంటి ఈ హీరో తన సినీ జీవితంలో ప్లాప్స్ అనేవి లేకుండా ముందుకు వెళ్లారు.. అలాంటి అన్నగారి కెరీర్లో ఒక డిజాస్టర్ కూడా ఉందని మీకు తెలుసా..1960 లో విడుదలైన కాడెద్దులు ఎకరం నేల..ఇదే సంవత్సరంలో ఎన్టీఆర్ 10 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిస్తే.. కాడెద్దులు ఎకరం నేల మూవీ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది..
Advertisement
also read:ఎరుపు, తెలుపు రంగు జామ పండ్లలో ఏది మంచిది.. నిపుణులు ఏమన్నారంటే..?
Advertisement
భట్టి విక్రమార్క సినిమా దర్శకత్వం వహించిన జంపన్న కాడెద్దులు ఎకరం నేల మూవీకి దర్శకుడిగా వహించారు. ఈ సినిమాలో పేదరైతు గా ఎన్టీఆర్ నటించారు. షావుకారు జానకి ఆయన సరసన నటించారు. ఇందులో రేలంగి, రమణారెడ్డి, పెరుమాళ్ళు, జగ్గారావు ఇంకా ఇతర నటులు ముఖ్య పాత్రల్లో చేశారు. జంపన్న డైరెక్షన్ లో భట్టి విక్రమార్క చిత్రం 1960 అక్టోబర్ ఒకటో తేదీన విడుదల అయింది. ఈ సినిమా విజయవంతమైన తర్వాత, వారం రోజుల్లోనే కాడెద్దులు ఎకరం నేల సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలు అంటే అభిమానులకు ఎనలేని క్రేజ్.
కొత్త సినిమా వచ్చింది అంటే చాలు జనాలు ఎగబడి చూసేవారు. అలాగే కాడెద్దులు ఎకరం నేల సినిమాను చూడటానికి కూడా ప్రేక్షకులు ఉత్సాహం చూపించారు. కానీ ఈ కథలో ఏ సన్నివేశం కూడా అంతగా పండక పోవడంతో అభిమానులంతా నిరాశపడ్డారు. దీంతో ఎన్టీఆర్ కెరీర్ లోనే దారుణమైన ప్లాఫ్ సినిమాగా ఈ మూవీ నిలిచింది. కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే ఈ సినిమా థియేటర్లలో నడిచింది. ఆ తర్వాత ఈ సినిమాను చూసిన వారైతే లేరు.
also read:ఒకే సినిమాలో హీరోగా మరియు విలన్ గా అదరగొట్టిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే ….!