Home » ఒకే సినిమాలో హీరోగా మరియు విలన్ గా అదరగొట్టిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే ….!

ఒకే సినిమాలో హీరోగా మరియు విలన్ గా అదరగొట్టిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే ….!

by AJAY
Ad

తమకెరీర్ లో కొంతమంది హీరోలు విలన్ గా కూడా నటించి మెప్పించారు. మోహన్ బాబు… చిరంజీవి లాంటి హీరోలు నెగిటివ్ రోల్స్ తో సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా హీరో గోపీచంద్ మరియు ఆది పినిశెట్టిలు సైతం విలన్ రోల్స్ చేసి భయపెట్టారు.

Advertisement

అయితే టాలీవుడ్ లో కొంతమంది స్టార్స్ మాత్రం ఒకే సినిమాలో విలన్ మరియు హీరో పాత్రలు చేసి అదరగొట్టారు. ఆ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో త్రిపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాలో విలన్ గాను తానే నటించాడు. అంతేకాకుండా విలన్ రోల్ లో తన అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ బయపెట్టగలిగాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

తమిళ స్టార్ హీరో విక్రమ్ విలక్షణ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అతని నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాగా విక్రమ్ ఇంకొక్కడు సినిమాలో విలన్ గా మరియు హీరోగా నటించి అదరగొట్టాడు.

Advertisement

తమిళ స్టార్ హీరో సూర్య నటన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక సూర్య తన కెరీర్ లో సూర్య 24 అనే సినిమాలో విలన్ గా మరియు హీరోగా నటించి అలరించాడు.

బాలయ్య కూడా నటనలో నటసింహం అనే చెప్పాలి. బాలయ్య డిఫరెంట్ పాటలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ప్రయోగాత్మక చిత్రాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య కూడా సుల్తాన్ సినిమాలో హీరోతో పాటు విలన్ రోల్ లో నటించి భయపెట్టాడు.

టాలీవుడ్ హీరో గోపీచంద్ వర్షం, జయం సినిమాల్లో విలన్ గా నటించి భయపెట్టాడు. ఆ తర్వాతే గోపీచంద్ హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక గోపీచంద్ కూడా గౌతమ్ నంద సినిమాలో తనను తానే ఢీకొట్టే పాత్రలో నటించి మెప్పించాడు.

నాచురల్ స్టార్ నాని తన బిరుదులకు తగినట్టుగా నేచురల్ గా నటిస్తూ ఉంటాడు. నాని ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించాడు. ఇక నాని కూడా వి సినిమాలో విలన్ గా మరియు హీరోగా నటించి మెప్పించగలిగాడు.

Also Read : ముత్యాల్లాంటి NTR చేతిరాత‌…ప్రింట్ కాదండోయ్! 

Visitors Are Also Reading