భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనున్నది. ఈ తరుణంలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ నిర్వహించడం అనివార్యం అయింది. తాజాగా ఎలక్షన్ కమిషన్ ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పోల్ ప్యానెల్ అందించిన పెన్నుతో మాత్రమే ఓటర్లు బ్యాలెట్ మార్క్ చేయాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఓటింగ్‌లో సీక్రెసీ (గోప్యత) పాటించాలని కోరుతూ ప్రెసిడెంట్ పోల్‌లో బ్యాలెట్ పత్రాలను మార్కింగ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన పెన్ను ను ఓటర్లకు అందించాలని ఎన్నిలక సంఘం రిటర్నింగ్ అధికారులను ఈసీ ఆదేశించింది.
Advertisement
ఈ మేరకు జులై 18న ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు రాష్ట్రాల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ ఆదేశాలలో ఓటింగ్ యొక్క గోప్యతను కాపాడేందుకు ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరును గుర్తించే అవకాశాన్ని నివారించడానికి ప్రతి ఓటర్‌కు ప్రత్యేకంగా రూపొందించిన పెన్నును అందించాలి. ఓటర్లు బ్యాలెట్ పేపర్ పై తమ ప్రాధాన్యతలను మార్కింగ్ చేయడానికి ఈ పెన్నును ఉపయోగిస్తారు.
Advertisement
రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్‌లకు ఓటర్లు ఓటు వేయడానికి వైలెట్ ఇంక్ పెన్నులను తగినంత సంఖ్యలో ఎలక్షన్ కమిషన్ అందజేస్తుంది. దీని ద్వారా ఓటును కేవలం వైలెట్ ఇంక్ పెన్నుతో మాత్రమే మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పెన్ను కాకుండా మరే ఇతర పెన్ను, బాల్ పాయింట్ పెన్ను తదితర వాటితో గుర్తు పెట్టినా ఆ బ్యాలెట్ పేపర్ 1974 ప్రెసిడెన్షియల్, వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రూల్స్ 31 (1) (డి) ప్రకారం.. చెల్లదు అని ఈసీ జూన్ 15న పేర్కొన్నది. ఇక రాజ్యసభ, రాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో కూడా ఓటర్లు ఇలాంటి పెన్నునే వినియోగిస్తారు.
Also Read :
చెల్లి పెళ్లికి అన్న.. చనిపోయిన తండ్రిని తీసుకొచ్చాడు.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు పెడతారు..?
రామ్ చరణ్ బాలనటుడిగా నటించిన సినిమా ఏదో మీకు తెలుసా..?