గూగుల్ ప్రధానంగా యూజర్ల వ్యక్తిగత భద్రతకు పెద్దపీట వేస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టి యూజర్ డేటాను సైబర్ దాడులు, హ్యాకర్ల నుండి కాపాడుతుంది. తాజాగా మరొక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నది. ఈ ఫీచర్ ద్వారా వార్నింగ్ బ్యానర్లు ఇప్పటికే జీ-మెయిల్, గూగుల్ డ్రైవ్ సేవల్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ ఫీచర్‌ను గూగుల్ చాట్లోనూ ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. రెండు వారాల్లో అందుబాటులోకి రానుంది.
Advertisement
ముందుగా గూగుల్ డ్రైవ్ విషయానికొస్తే ఈ ఫీచర్ డిఫాల్డ్‌గా ఎనేబుల్ చేసి ఉంటుంది. యాప్లో డేంజర్ డాక్యుమెంట్, ఫోటోను ఓపెన్ చేయగానే గూగుల్ వేగంగా స్కాన్ చేసి వెంటనే వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022 సందర్భంగా కంపెనీ తన ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ కు చెందిన రెండవ బీటాను కూడా విడుదల చేసింది. గోప్యత భద్రతకు సంబంధించిన అప్‌డేట్‌లతో పాటు కొత్త ఫీచర్లు అందిస్తుంది.
Advertisement
తాజా సమాచారం ప్రకారం.. క్రోమ్ ఓ అడ్వాన్స్ డ్ స్క్రీన్ షాట్ టూల్‌ను విండోస్ 11, విండోస్-10 మ్యాక్స్ ఓఎస్ యూజర్లకు తీసుకొస్తుంది. క్రోమ్ బీటా వెర్షన్‌లోని కొత్త టూల్స్‌లో ఈ స్క్రీన్ షాట్ టూల్ కనిపించింది. దీని సాయంతో వెబ్ పేజీలను స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సర్కిల్స్, స్క్వేర్స్, లైన్స్ వివిధ షేపులు వెబ్‌సైట్ పేజీ స్క్రీన్ షాట్ పేస్ట్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. మైక్రోసాప్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఉన్న వెబ్ కాప్చర్ టూల్ మాదిరిగానే పని చేస్తుంది . కొత్త టూల్‌లో ఎక్కువ ఆప్షన్ ఉంటాయి. ఈ టూల్ మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Also Read :
Raviteja: రవితేజ రోజుకు పది రూపాయలతో అలా బతికారని బయటపెట్టిన ఆ హీరోయిన్..!
మేజర్ సినిమాకు సెన్సార్ సెల్యూట్.. 10 రోజుల ముందే స్పెషల్ షోలు..!