సంజూ శాంసన్ పై భారత క్రికెట్ అభిమానుల్లో ఓ సాఫ్ట్ కార్నర్ అనేది ఉంది. అందుకు కారణం బీసీసీఐ అతని పై వ్యవరిస్తున తీరు. అతనిలో ఎంత టాలెంట్ అనేది ఉన్న అతనికి తగ్గిన అవకాశాలు అనేవి బీసీసీఐ ఇవ్వడం లేదు చాల మంది భారత క్రికెట్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. అందుకే ఎప్పుడు జట్టును ప్రకటించిన అందులో సంజూ పేరు అనేది లేకపోతే బీసీసీఐ విమర్శలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి.
Advertisement
అయితే వచ్చే నెలలో జరిగే ప్రపంచ కప్ అలాగే అతని సొంత రాష్ట్రం అయిన కేరళలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ కోసం కూడా సంజూ శాంసన్ ను ఎంపిక చేయలేదు. అందుకే అక్కడ క్రికెట్ ఫ్యాన్స్.. భారత ఆటగాళ్లకు సంజూ నామకరణంతో వెల్కమ్ చెప్పారు. అయితే తాజాగా ఈ సంజూ వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు.
Advertisement
ఓ ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ.. సంజూ ఓ అద్భుతమైన ఆటగాడు. అతను ఐపీఎల్ లో కూడా తన జట్టు తరపున బాగా రాణిస్తున్నాడు. అయితే ప్రపంచ కప్ లో కూడా అతని కొంచెంలో తన స్థానం కోల్పోయాడు. కానీ అతను భవిష్యత్ లో భారత జట్టుకు పూర్తి స్థాయి ఆటగాడిగా మారుతాడు. ఇక అదే విధంగా సంజూ సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లో తప్పకుండ ఆడుతాడు అని గంగూలీ క్లారిటీ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి :