అలనాటి అందాల తార, తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు సౌందర్య. ముఖ్యంగా గ్లామర్ షోలకు ఆమడ దూరంలో ఉంటూ తెలుగు అమ్మాయి మాదిరిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. అమ్మోరు సినిమాతో ఒక్కసారిగా ఈ హీరోయిన్ కెరీర్ టర్న్ అయింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి.
Advertisement
ఇది ఇలా ఉండగా, కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ భాషలలో కూడా సౌందర్య హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. అంతేకాదు సౌందర్య ఒకానొక టైం లో ఏడాదికి పది చిత్రాలు నటించిన క్రెడిట్ కూడా దక్కింది. ఇక రాను రాను హీరోయిన్లకు మధ్య పోటీ పెరగడం వల్ల సౌందర్యకు కొన్ని అవకాశాలు తగ్గాయి. ఇక సౌందర్య తండ్రి సత్యనారాయణ జ్యోతిష్యుడు కూడా. 2004లోనే సౌందర్య కెరియర్ అర్ధాంతరంగా ముగుస్తుందని ఆయన ముందే చెప్పారట.
కానీ ఈ విషయాన్ని సౌందర్య అంగీకరించేది కాదట. నేను 50 ఏళ్లు వచ్చేవరకు సినిమాల్లోనే ఉంటాను. ఇండస్ట్రీ నన్ను ఎప్పటికీ వదులుకోదు. నా ఏజ్ కి తగ్గ పాత్రలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయని చెప్పేదట. కానీ విధి ఆడిన వింత నాటకంలో సౌందర్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తన తండ్రి మాటే నిజమైంది. విమాన ప్రమాదంలో సౌందర్య మరణించింది. ఇలా సౌందర్య 50 ఏళ్ల వరకు నటిస్తాను అనే కోరిక తీరకుండానే మరణించింది.
READ ALSO: క్యాన్సర్ బారిన పడిన ఆటో రాంప్రసాద్?