సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. కానీ ప్రేక్షకుల మదిలో చెరగని మద్ర వేసుకునే హీరోయిన్ లు మాత్రం అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ అందాలతార సౌందర్య. తన కెరీర్ లో సౌందర్య ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించింది.
Advertisement
టాలీవుడ్ లోని స్టార్స్ అందరితోనూ జతకట్టింది. తెలుగుతో పాటూ తమిళ కన్నడ చిత్రాలలోనూ సౌందర్య సినిమాలు చేసింది. ఎన్ని సూపర్ హిట్స్ పడినా సౌందర్య గర్వపడేవారు కాదు. ప్రతి సినిమానూ మొదటి సినిమా మాదిరిగానే చేసేవారని ఆమెతో సినిమాలు చేసిన దర్శకనిర్మాతలు నటీనటులు చెబుతుంటారు.
Advertisement
ఇదిలా ఉంటే సౌందర్య నటించిన సూపర్ హిట్ చిత్రాలలో నరసింహ సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించగా రజినీకాంత్ హీరోగా నటించారు. అంతే కాకుండా రమ్య కృష్ణ ఈ సినిమాలో పొగరుబోతు అమ్మాయిలా కనిపించారు. అయితే సినిమాలో రజినీకాంత్ తరవాత హీరోయిన్ సౌందర్య కంటే విలన్ గా నటించిన రమ్యకృష్ణ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది.
అయితే నిజానికి నిలాంబరి పాత్ర సౌందర్య చేయాల్సి ఉందట. కానీ రజినీకాంత్ వల్ల ఆ పాత్ర రమ్యకృష్ణకు వెళ్లిందట. రజినికాంత్ సౌందర్యను ఆ పాత్ర చేయవద్దు అని చెప్పడానికి ఓ కారణం ఉంది. సౌందర్య అప్పుడు హీరోయిన్ పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాంటి సమయంలో నెగిటివ్ రోల్ లో నటిస్తే కెరీర్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని రజినీ భావించి వద్దని చెప్పారట. అలా రమ్యకృష్ణను నీలాంబరి పాత్రకు ఎంపిక చేశారు. ఇక ఆ పాత్రకు రమ్యకృష్ణ వందశాతం న్యాయం చేశారు.
ALSO READ : టీవీ నుండి వచ్చి సినిమాల్లో సత్తా చాటుతున్న 10 మంది నటీనటలు వీళ్లే..!