Home » టీవీ నుండి వ‌చ్చి సినిమాల్లో స‌త్తా చాటుతున్న 10 మంది న‌టీన‌ట‌లు వీళ్లే..

టీవీ నుండి వ‌చ్చి సినిమాల్లో స‌త్తా చాటుతున్న 10 మంది న‌టీన‌ట‌లు వీళ్లే..

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలోకి కొంతమంది వారసులుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతే కొంతమంది మాత్రం ఎంతో కష్టపడి సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అవుతారు. అసిస్టెంట్ డైరెక్టర్ లుగా…. యాంకర్లుగా సీరియల్స్ లో నటీనటులుగా ఎంట్రీ ఇచ్చి చాలామంది సినిమాల్లో స్టార్స్ గా సక్సెస్ అయ్యారు. అలా టీవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న నటీనటులు ఎవరు ఇప్పుడు చూద్దాం.

Advertisement

నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులను సంపాదించుకున్నారు. నిజానికి విజయ్ సేతుపతి కెరీర్ ప్రారంభంలో సీరియల్స్ లో నటించారు. 2006లో సినిమాల్లోకి వచ్చిన విజయ్ సేతుపతి సన్ టీవీ నెట్వర్క్ లో ఓ సిరీస్ లో నటించారు. అలా మెల్లిమెల్లిగా ఎదిగి సినిమా అవకాశాలను అందుకున్నారు.


సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా తన కెరీర్ ను టీవీలోనే ప్రారంభించారు. మొదట నయనతార టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించారు. చమయం అనే షో ద్వారా నయనతార బుల్లితెరపై సందడి చేశారు. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.

Advertisement


డాన్ సినిమాతో శివ కార్తికేయన్ పాన్ ఇండియా హీరోగా మారాడు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఇక ఆ శివ కార్తికేయన్ కూడా టీవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి సినిమా హీరోగా సక్సెస్ అయ్యాడు. కెరీర్ ప్రారంభంలో యాంకర్ గా పనిచేసిన‌ శివ కార్తికేయన్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన కెరీర్ ను టీవీ నుండే మొదలుపెట్టాడు. ప్రకాష్ రాజ్ కెరీర్ ప్రారంభంలో దూరదర్శన్ సీరియల్స్ లో నటించాడు. ఇక ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ హిందీ భాషలలోనూ బిజీగా ఉన్నాడు.


యాంకర్ అనసూయ కూడా తన కెరీర్ ను టీవీ నుంచే ప్రారంభించింది. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంటుంది.

కేజిఎఫ్ హీరో య‌ష్ కూడా కెరీర్ ప్రారంభంలో సీరియల్స్ లో నటించాడు. కన్నడలో పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించాడు .ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. కేజీఎఫ్ సినిమాతో య‌ష్ పాన్ ఇండియా హీరోగా మారాడు.

Visitors Are Also Reading