ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా ఒక్కే వారంలో రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం మాములు విషయం. కానీ రెండు సినిమాలు అగ్ర హీరోలవి అయితే పెద్ద చర్చ జరుగుతుంది. అందులో గెలుపెవరిది అనేది విషయం పైనా..! అయితే ఈ మధ్య ఇలా ఒక్కే వారంలో రెండు పెద్ద సినిమాలు రావడం లేదు. కానీ అప్పట్లో మాత్రం ఈ విధంగా చాలా సార్లు జరిగింది. ఇక మన తెలుగులో ఓ సారి.. ఒక్కే వారంలో ముగ్గురు అగ్ర హీరోలు పోటీకి వచ్చారు. అయితే అందులో హీరో ఎవరో తెలుసా.. ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisement
1984 ఆగస్టులో ఒకే వారంలో శోభన్ బాబు నటించిన ఇల్లాలు ప్రియురాలు సినిమా, సూపర్ స్టార్ కృష్ణ యొక్క బంగారుకాపురం అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమా అయిన ఛాలెంజ్ సినిమాలు విడుదల అయ్యాయి. శోభన్ బాబు సినిమా మూడు విడుదల కాగా… ఆ తర్వాత ఒక్కే రోజు కృష, చిరంజీవి సినిమాలు తియేటర్లోకి వచ్చాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఈ మూడు సినిమాల్లో ఇల్లాలు ప్రియురాలు, ఛాలెంజ్ సినిమాకు కోదండరాంరెడ్డి ఒక్కరే దర్శకులు కాగా.. బంగారుకాపురం ను చంద్రశేఖర్ రెడ్డి తెరకెక్కించారు.
అయితే ఈ మూడు సినిమాలో శోభన్ బాబు ఇల్లాలు ప్రియురాలు సినిమా మహిళలను బాగా ఆకర్షించింది. అలాగే చిరంజీవి ఛాలెంజ్ సినిమాకు యువత బ్రహ్మరథం పట్టారు. అలాగే ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోగా… కృష్ణ బంగారుకాపురం సినిమా యావరేజ్ గా ఉంది అనిపించుకుంది.
ఇది కూడా చదవండి :
వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!
ఐపీఎల్ or లవర్ : మీ సమాధానం ఏంటి..?