టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసినటువంటి నటులలో స్నేహ కూడా ఒకరు. తన అద్భుతమైన నటన, అందంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా చాలా సాంప్రదాయంగా కనిపించే ఈ బ్యూటీ ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రసన్న కుమార్ అనే తమిళ నటుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక వివాహ అనంతరం కొన్ని రోజులపాటు సినిమాలకు దూరంగా ఉంది.
ఇక చాలాకాలం తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రసన్నకుమార్ స్నేహ జంటకు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ అనే బిరుదుని ఇచ్చారు. వీరిద్దరూ చాలా అన్యోన్యంగా వారి జీవితాన్ని కొనసాగిస్తూన్నారు. ఈ క్రమంలోనే స్నేహాకి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రసన్న కుమార్ కన్నా ముందే స్నేహ మరొక వ్యక్తిని ప్రేమించిందని, ఆ ప్రేమ విఫలం కావడంతో వివాహం చేసుకోకూడదని అనుకుందని ఓ దర్శకుడు వెల్లడించాడు.
Advertisement
Advertisement
నిర్మాత రవితో స్నేహ ప్రేమలో పడిందని, వారిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారని, ఎంగేజ్మెంట్ అనంతరం రవి క్యారెక్టర్ మంచిది కాదని తెలుసుకున్న స్నేహ ఆ వ్యక్తికి బ్రేకప్ చెప్పిందట. ఇక ఈ సంఘటన తర్వాత ప్రసన్నకుమార్ తో స్నేహకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని స్నేహ కాస్త భయంగానే తనతో ప్రేమలో పడిందని ఓ డైరెక్టర్ వెల్లడించాడు. వీరిద్దరూ వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇక స్నేహ ప్రస్తుతం సినిమాలలో మళ్లీ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. పలు షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఇవి కూడా చదవండి
- Anushka : అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?
- Kalyaan Dhev : శ్రీజ ఫ్రెండ్‌నే రెండో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్..?
- Vishal : విశాల్ సంచలనం ఆరోపణలు..రంగంలోకి మోడీ ?